KALYANA VENKANNA GLITTERS ON SWARNA RATHAM_ స్వర్ణరథంపై కాంతులీనిన కల్యాణ వెంకన్న

Srinivasa Mangapuram, 6 May 2018: The Swarna Rathotsavam was performed on Sunday evening part of the ongoing Annual Vasanthotsavam of Sri Kalyana Venkateswara swamy Temple at Srinivasa Mangapuram.

Earlier in the morning after daily morning rituals celestial abhisekham of Snapana Tirumanjanam was performed to the deity with honey, curd, milk, sandal paste, coconut water and perfumed water. Later in the evening the utsava idol was paraded on the mada streets along with both consorts.

On May 7 at the conclusion of the Vasanthotsavam the devotee couple could participate with payment of Rs.516 and beget bahumanam of uttariyam, blouse, annaprasadam etc. The TTD cancelled the arjita sevas of Kalyanotsavam, Swarna Pushparchana, and Astottara shatakalashabisekham in view of Vasantotsavam.

Local Temples DyEO Sri P Venkataiah, Suptd Sri Ramanaiah, Temple Inspector Sri Anil Kumar and other officials, archakas and also devotees participated in the event.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

స్వర్ణరథంపై కాంతులీనిన కల్యాణ వెంకన్న

తిరుపతి, 2018 మే 6: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక వసంతోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం స్వర్ణరథోత్సవం కన్నులపండుగగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమల, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం శ్రీవారి ఉత్సవర్లను వసంత మండపానికి వేంచేపు చేసి ఆస్థానం నిర్వహించారు. మధ్యాహ్నం 2.00 నుండి 4.00 గంటల వరకు స్నపనతిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పంచ ద్రవ్యాలైన పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు. సాయంత్రం 6.00 నుండి రాత్రి 7.00 గంటల వరకు ఉభయదేవేరులతో కలిసి స్వామివారు స్వర్ణరథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు.

కాగా మే 7వ తేదీన వసంతోత్సవాలు ముగియనున్నాయి. గృహస్తులు(ఇద్దరు) ఒక రోజుకు రూ.516/- చెల్లించి ఈ వసంతోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు. వసంతోత్సవాల కారణంగా ఆలయంలో ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, స్వర్ణపుష్పార్చన, అష్టోత్తర శతకలశాభిషేకం సేవలను రద్దు చేశారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల ఉప కార్యనిర్వహణాధికారి శ్రీ పి.వెంకటయ్య, సూపరింటెండెంట్లు శ్రీ రమణయ్య, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీఅనిల్‌ కుమార్‌, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.