KALYANA VENKANNA TAKES PRIDE RIDE ON LOYAL HANUMANTHA_ హనుమంత వాహనంపై శ్రీ కల్యాణ రాముడు

Srinivasa Mangapuram, 11 February 2018: On the sixth day morning during the ongoing Navahnika brahmotsavams at Srinivasa Mangapuram, the processional deity of Lord Sri Kalyana Venkateswara took a pride celestial ride loyal Hanumantha Vahanam.

Among the different carriers of Lord, it Hanumantha who holds the status on par with His Master and hence revered as Lord.

With his exemplary loyal services, Hanuman stood as an icon and role model of selfless service and is worshipped as Lord Hanuman.

The devotees turned out in large numbers to witness Lord Kalyana Venkateswara on Lord Hanuman on the bright Sunny day on Sunday.

DyEO Sri Venkataiah, AEO Sri Srinivasulu, Exe Engineer Sri Manohar, DyEE Sri Ramamurthy, Chief kankana bhattar Sri Balaji Rangacharyulu, AE Sri Nagaraju, AVSO Sri Ganga Raju and others participated.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

హనుమంత వాహనంపై శ్రీ కల్యాణ రాముడు

తిరుపతి, 2018 ఫిబ్రవరి 11: శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన ఆదివారం ఉదయం శ్రీరాముని అవతారంలో తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిచ్చాడు. ఉదయం 8.00 గంటల నుండి 9.00 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనసేవ ముందు గజరాజులు ఠీవిగా నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి
స్వామివారిని దర్శించుకున్నారు.

శ్రీవేంకటేశ్వరుణ్ణి శ్రీరాముడిగా భావించి, శ్రీవారిసుప్రభాతాన్ని రచించిన శ్రీహస్తిగిరినాథన్‌ ”కౌసల్యా సుప్రజా రామ! ” అంటూ స్తుతించారు. రామాయణంలోని శ్రీరాముడే ద్వాపరంలో శ్రీకృష్ణుడు. ఈ యుగంలో వేంకటేశ్వరుడు. కనుక స్వామి వేంకటరాముడు, వేంకటకృష్ణుడు, వేంకటాచలపతి – ఇలా త్రివేణీసంగమయిన సేవ – హనుమద్వాహనసేవ.

దాస్యభక్తుల్లో హనుమంతుడు పేరెన్నికగన్నవాడు. వేదాలూ, వ్యాకరణాలూ సమస్తమూ క్షుణ్ణంగా తెలిసినవాడు. హనుమంతుణ్ణిసేవిస్తే, రోజూ భక్తితో దర్శిస్తే, భక్తులకు బుద్ధి, బలం, యశస్సు, ధైర్యం, నిర్భయత్వం, ఆరోగ్యం, చైతన్యం, మంచి వాక్‌శక్తి సిద్ధిస్తాయి. అందుకే హనుమంతుడు భక్తులతో ”మీకు కావలసిన భౌతిక, ఆధ్యాత్మిక, ధార్మిక ఫలాలన్నీ నేనే ఇస్తా. మోక్షంమాత్రం నాస్వామి రామయ్యనే సేవించి పొందండి” అన్నాడు. కనుక ఈనాటి వాహనంగాఉన్న హనుమంతుని దర్శనంతో బుద్ధిబలం మొదలైనవన్నీ లభిస్తాయి. హనుమంతునిపైనున్న శ్రీవారిని దర్శించడంతో ఇహమేకాక పరమమైన మోక్షంకూడా లభిస్తుంది.

ఈ హనుమంతవాహనోత్సవం – ప్రతివ్యక్తీ హనుమంతునివలె నిష్కళంక హృదయం, నిస్స్వార్థసేవా తత్పరత, ప్రభుభక్తి పరాయణత, సచ్ఛీలం మున్నగు సుగుణ సంపత్తి కల్గిఉంటే భగవంతునికి మిక్కిలి సన్నిహితులై, స్వామి కృపకు సర్వదా పాత్రుడవుతాడు. హనుమంతుడు రాబోయే కల్పంలో బ్రహ్మ అవుతాడు.

వసంతోత్సవం

అనంతరం మధ్యాహ్నం 3.00 నుండి 4.30 గంటల వరకు శ్రీవారి కల్యాణమండపంలో వసంతోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి సుగంధ సంభరిత
వికాస పుష్పాలను సమర్పించుటమే కాక వివిధ రకాల ఫలాలను తెచ్చి నివేదిస్తారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ వెంకటయ్య, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ శ్రీనివాసులు, ఇఇ శ్రీ మనోహరం, ప్రధాన కంకణబట్టార్‌ శ్రీబాలాజీరంగాచార్యులు, ఏఈ శ్రీ నాగరాజు, ఎవిఎస్వో శ్రీ గంగారాజు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది