KALYANA VENKATESWARA DONS RAJAMANNAR ALANKARA _ కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజమన్నార్ అలంకారంలో శ్రీనివాసుడి వైభవం
Tirupati, 5 Mar. 21: On the fourth day morning Sri Kalyana Venkateswara Swamy in Raja Mannar Alankara cheered devotees.
As part of ongoing brahmotsavams at Srinivasa Mangapuram Kalyana Venkateswara flanked by Sridevi and Bhudevi blessed the devotees on Friday morning on Kalpavriksha Vahana Seva, which was held in Ekantam as per Covid guidelines.
DyEO Smt Shanti, AEO Sri Dhananjeyulu, Superintendents Sri Ramanaiah, Sri Chengalrayulu participated.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజమన్నార్ అలంకారంలో శ్రీనివాసుడి వైభవం
తిరుపతి, 2021 మార్చి 05: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన శుక్రవారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుడు శ్రీ రాజగోపాలస్వామివారి అలంకారంలో చంద్రకోలు, దండం ధరించి కల్పవృక్ష వాహనంపై దర్శనమిచ్చారు. కోవిడ్ -19 నేపథ్యంలో వాహనసేవ ఆలయంలో ఏకాంతంగా జరిగింది.
కల్పవృక్ష వాహనం – ఐహిక ఫల ప్రాప్తి
శ్రీ కల్యాణ వేంకటేశ్వరుడు నాలుగో రోజు ఉదయం కల్పవృక్ష వాహనంపై దర్శనమిస్తూ కల్పవృక్షం ఇవ్వలేని ధర్మమోక్షాల్ని కూడా నేను అనుగ్రహిస్తానని నిరూపిస్తున్నారు. కల్పవృక్షాలు లోకాతీతమైన ఏ ఫలాన్నయినా ఇస్తాయి. ఇవి కోరుకునేవారి తెలివిని బట్టి లభిస్తాయి. ఈనాటి వాహనమైన కల్పవృక్షం ఐదు కల్పవృక్షాల ఏకరూపం. అన్ని కల్పవృక్షాలిచ్చే ఫలాలూ శ్రీవారే ఇస్తారు. శ్రీదేవి, భూదేవి ఇహలోక ఫలాలిస్తారు. శ్రీవారు దివ్యలోకఫలాలు, ముక్తిని ప్రసాదిస్తారు. కనుక కల్పవృక్ష వాహనోత్సవ సేవ ఇహపరఫల ఆనందదాయకం.
కాగా రాత్రి 7 నుండి 8 గంటల వరకు సర్వభూపాల వాహన సేవ జరుగనుంది.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ ధనంజయులు, సూపరింటెండెంట్ శ్రీ చెంగల్రాయులు, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.