KALYANAM PERFORMED IN A GRAND MANNER IN CHANDRAGIRI RAMALAYAM_ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం

Chandragiri, 1 April 2018: The divine Sita Rama Kalyanam was performed with religious fervour in the TTD taken over temple of Sri Kodandaramalayam in CHANDRAGIRI.

On Sunday evening the celestial marriage took place between 5pm and 7pm.

Local legislator Sri Ch Bhaskar Reddy presented silk vastrams to the deities.

Temple DyEO Sri Subrahmanyam supervised the arrangements for the big wedding.

Devotees thronged to Kalyana Vedika in huge numbers to take part in the divine wedding ceremony.

After Mangala Sharanam, prasadams were distributed to Pilgrims.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం

ఏప్రిల్‌ 01,తిరుపతి, 2018: చంద్రగిరిలోని శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం సాయంత్రం ఆలయంలో శ్రీ సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. సర్వాంగ సుందరంగా అలంకరించిన మండపంలో స్వామి, అమ్మవారిని ఆశీనులను చేసి అర్చకులు శాస్త్రోక్తంగా కల్యాణఘట్టాన్ని నిర్వహించారు.

సాయంత్రం 6.00 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం కన్నులపండుగగా ప్రారంభమైంది. ఇందులో భాగంగా పుణ్యాహవచనం, సద్యో అంకురార్పణ, రక్షాబంధన, విశేషారాధన చేశారు. ఆ తరువాత రక్షాబంధనం, అగ్నిప్రతిష్ఠ, మధుపర్కం, కన్యాదానం, మహాసంకల్పం, స్వామి, అమ్మవారికి ప్రవరలు, మాంగళ్యపూజ చేపట్టారు. అనంతరం మాంగళ్యధారణ, ఉక్తహోమాలు, పూర్ణాహుతి, నివేదన, అక్షతారోహణం, హారతి ఇచ్చారు. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు వచ్చే భక్తులకు ప్రసాదాలు, తాగునీరు, మజ్జిగ తదితర సౌకర్యాలను టిటిడి ఏర్పాటుచేసింది.

రాత్రి 8.00 గంటల నుండి 9.30 గంటల వరకు విశేషమైన గరుడ వాహనంపై శ్రీకోదండరామస్వామివారు భక్తులకు కనువిందు చేయనున్నారు. బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ ముఖ్యమైనది. గరుత్మంతుడే శ్రీరాముని అవతారమైన శ్రీమహావిష్ణువుకు నిత్యవాహనం. దాసుడుగా, సఖుడుగా, విసనకర్రగా, చాందినిగా, ఆసనంగా, ఆవాసంగా, వాహనంగా ధ్వజంగా అనేక విధాల సేవలందిస్తున్న నిత్యసూరులలో అగ్రగణ్యుడైన వైనతేయుడు కోదండరామస్వామిని వహించి కదిలే తీరు సందర్శనీయమైనది.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానికాలయాల డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, శ్రీఇజి.శంకరరాజు, ప్రధానార్చకులు శ్రీ శ్రీనివాస భట్టర్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ కృష్ణచైతన్య, ఇతర అధికారులు, అర్చకులు, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.