KALYANOTSAVAM HELD IN EKANTHAM AT APPALAYAGUNTA _ ఏకాంతంగా శ్రీ ప్రసన్నవేంకటేశ్వరుడి కళ్యాణం

Tirupati, 22 Jun. 21: Kalyanotsavam was held in Ekantam at Appalayagunta on Tuesday evening as part of ongoing annual brahmotsavams.

Vishwaksena Aradhana, punyavachanam, kankana dharana, Agni pratishthapana, sankalpam, Maha sankalpam, mangalya dharana held in sequence before concluded with Nakshatra Harati and Mangala Harati.

Temple Deputy EO Smt Kasturi Bai and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఏకాంతంగా శ్రీ ప్రసన్నవేంకటేశ్వరుడి కళ్యాణం

తిరుపతి, 2021 జూన్ 22: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగ‌ళ‌వారం సాయంత్రం స్వామివారి కల్యాణోత్సవం ఏకాంతంగా జరిగింది.

సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, కంకణధారణ, అగ్నిప్రతిష్టాపన, యజమాని సంకల్పం, మహాసంకల్పం, మంగళసూత్రధారణ ఘట్టాలతో స్వామివారి కల్యాణాన్ని నిర్వహించారు. చివరిగా నక్షత్రహారతి, మంగళహారతి కార్యక్రమంతో కల్యాణం ముగిసింది.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి క‌స్తూరి బాయి, ఏఈవో శ్రీ ప్ర‌భాక‌ర్ రెడ్డి, ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు మ‌రియు కంక‌ణ‌బ‌ట్టార్ శ్రీ సూర్య‌కుమార్ ఆచార్యులు, సూప‌రింటెండెంట్ శ్రీ గోపాల కృష్ణారెడ్డి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ శ్రీ‌నివాసులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.