KALYANOTSAVAM IN BUGGA_ మార్చి 20న బుగ్గలోని శ్రీ కాశీవిశ్వేశ్వరాలయంలో కల్యాణోత్సవం

Tirupati, 15 Mar. 19: The celestial kalyanam of Sri Kasi Vishveswara Swamy and Anna Purna Devi will take place in Bugga on March 20.

This ancient historical sub shrine of TTD is located in Chittoor district. In the morning there will be snapana tirumanjanam to utsava murthies while in the evening celestial kalyanam will be observed.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

మార్చి 20న బుగ్గలోని శ్రీ కాశీవిశ్వేశ్వరాలయంలో కల్యాణోత్సవం

మార్చి 15, తిరుపతి, 2019: టిటిడికి అనుబంధంగా ఉన్న బుగ్గలోని శ్రీ అన్నపూర్ణ సమేత కాశీవిశ్వేశ్వరస్వామివారి ఆలయంలో మార్చి 20వ తేదీన కల్యాణోత్సవం జరుగనుంది.

ఈ సందర్భంగా ఉదయం 10 నుండి 11 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు విశేషంగా స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు కల్యాణోత్సవం జరుగనుంది. గృహస్తులు(ఇద్దరు) రూ.500/- టికెట్‌ కొనుగోలుచేసి కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక చిన్న వడ బహుమానంగా అందిస్తారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.