KANCHI PONTIFF TAKES PART IN PURNAHUTI _ పూర్ణాహుతిలో పాల్గొన్న కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి
TIRUMALA, 16 MAY 2023: The Pontiff of Kanchi Kamakoti Peetham, HH Sri Vijayendra Saraswati took part in the Purnahuti of Sundarakanada Sampoorna Akhanda Parayanam held at Dharmagiri Veda Vignana Peetham in Tirumala on Tuesday evening.
The unique religious event which began at 6am concluded by 8:45pm without any interval and all the 2872 shlokas from Sundarakanda were recited by 67 vedic scholars.
Devotees also participated with utmost dedication.
TTD EO Sri AV Dharma Reddy and others were present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
పూర్ణాహుతిలో పాల్గొన్న కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి
తిరుమల, 2023 మే 16: తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో మంగళవారం రాత్రి జరిగిన సంపూర్ణ సుందరకాండ అఖండ పారాయణం పూర్ణాహుతి కార్యక్రమంలో కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కంచి పీఠాధిపతి అనుగ్రహ భాషణం చేస్తూ హనుమంతుని జన్మస్థలమైన అంజనాద్రిలో ఐదు రోజులపాటు హనుమజ్జయంతి ఉత్సవాలు నిర్వహించడం సంతోషకరమన్నారు. ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్న టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డిని అభినందించారు. ఐదు రోజుల కార్యక్రమంలో మధ్యరోజైన మూడోరోజు అఖండ సుందరకాండ పారాయణం నిర్వహించడం గొప్ప విషయమన్నారు.
ఉదయం 6 గంటలకు ప్రారంభమైన పారాయణ కార్యక్రమం విరామం లేకుండా రాత్రి 8.45 గంటలకు ముగిసింది. సుందరకాండలోని మొత్తం 2,872 శ్లోకాలను 67 మంది వేద పండితులు పఠించారు. భక్తులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్రీ ఏవీ ధర్మారెడ్డి, ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపల్ శ్రీ కెఎస్ఎస్.అవధాని, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్ట్ ఆఫీసర్ డా. విభీషణ శర్మ తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.