KANCHI SEER LAUDS PARAYANAM AND SPIRITUAL PROGRAMS MULLED BY TTD _ శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న కంచి పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ విజ‌యేంద్ర స‌ర‌స్వ‌తి పారాయ‌ణం, కార్తీక మాస పూజా కార్య‌క్ర‌మాలు బాగున్నాయ‌ని ప్ర‌శంస‌

PEDDA MARYADALU HELD TO KANCHI SEER

TAKES PART IN VEDA PARAYANAM

Tirumala, 2 December 2020: Paramapujya Parivrajakacharya Sri Sri Vijayendra Saraswathi Swamy lauded the Parayanam and other spiritual programmes mulled by TTD.

The pontiff who had the traditional customary Tirumala temple honours on Wednesday and had darshan of Lord Venkateswara. He also took part in the Krishna Yajurveda Jatha Parayanam at Ranganayakula Mandapam.

Later speaking to media persons outside the temple, he said all these spiritual programs not only boost the morale of the devotees but also provide them a healthy and wealthy life. He also said the Karthika Masa Deeksha programs at Vasanta Mandapam and also community Karthika Deepotsavam in Tirupati are very good for the well being of entire humanity. “The Siva Kesava Aaradhana in the holy Karthika month will provide health, security, and prosperity to all”, he added.

TTD Board Member Sri Sekhar Reddy, CVSO Sri Gopinath Jatti, Temple DyEO Sri Haridranath, Temple Peishkar Sri Jaganmohanacharya, VGO Sri Bali Reddy and others were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTD, TIRUPATI

శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న కంచి పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ విజ‌యేంద్ర స‌ర‌స్వ‌తి పారాయ‌ణం, కార్తీక మాస పూజా కార్య‌క్ర‌మాలు బాగున్నాయ‌ని ప్ర‌శంస‌

తిరుమల‌, 2020 డిసెంబ‌రు 02: కంచి కామకోటి పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ విజ‌యేంద్ర స‌ర‌స్వ‌తి స్వామి బుధ‌వారం ఉద‌యం తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారు. ముందుగా పాత అన్నదాన భవనం వద్ద గల రావిచెట్టు వద్దకు స్వామీజీ చేరుకున్నారు. టిటిడి అర్చకస్వాములు, అధికారులు ఇస్తికఫాల్‌ స్వాగతం పలికారు. శ్రీ బేడి ఆంజనేయస్వామివారిని ద‌ర్శించుకున్న అనంత‌రం మేళతాళాల మధ్య శ్రీవారి ఆలయంలోకి తీసుకెళ్లి దర్శనం చేయించారు.

శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న అనంత‌రం ఆల‌యం వెలుప‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ విజ‌యేంద్ర స‌ర‌స్వ‌తి స్వామి మీడియాతో మాట్లాడుతూ పారాయ‌ణ కార్య‌క్ర‌మాలు, కార్తీక మాస పూజా కార్య‌క్ర‌మాలను టిటిడి నిర్వ‌హిస్తుండ‌డం అభినంద‌నీయ‌మ‌న్నారు. ఈ కార్య‌క్ర‌మాలు బాగున్నాయ‌ని ప్ర‌శంసించారు. నాద‌నీరాజ‌నం వేదిక‌పై సుంద‌ర‌కాండ‌, విరాట‌ప‌ర్వం, భ‌గ‌వ‌ద్గీత, శ్రీ‌వారి ఆల‌యంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో వేద పారాయ‌ణం, వ‌సంత‌మండ‌పంలో విష్ణుపూజ‌లు, తిరుప‌తిలోని క‌పిల‌తీర్థంలో హోమాలు, పూజ‌లు నిర్వ‌హిస్తున్నార‌ని వివ‌రించారు. వైకుంఠ ఏకాద‌శి సంద‌ర్భంగా ప‌ది రోజులపాటు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాన్ని టిటిడి క‌ల్పించ‌నుంద‌ని తెలిపారు. ప్ర‌జ‌లంద‌రూ ధ‌ర్మాన్ని ఆచ‌రించాల‌ని, త‌ద్వారా వ్య‌క్తి వికాసంతోపాటు దేశ వికాసం క‌లుగుతుంద‌ని వివ‌రించారు.

మాన‌వ నాగ‌రిక‌త‌కు మూలం వేదం :  కంచి పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ విజ‌యేంద్ర స‌ర‌స్వ‌తి

రంగ‌నాయ‌కుల మండ‌పంలో వేద‌పారాయ‌ణానికి విచ్చేసిన స్వామీజీ

మాన‌వ నాగ‌రిక‌త‌కు మూలం వేదాల‌ని, మోక్షసాధ‌న కోసం ఇవి మార్గ‌ద‌ర్శ‌క‌త్వం చేస్తాయ‌ని కంచి కామకోటి పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ విజ‌యేంద్ర స‌ర‌స్వ‌తి స్వామి ఉద్ఘాటించారు. బుధ‌వారం ఉద‌యం తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న అనంత‌రం రంగ‌నాయ‌కుల మండ‌పంలో జ‌రిగిన వేద‌పారాయ‌ణానికి స్వామీజీ విచ్చేశారు.

ఈ సంద‌ర్భంగా స్వామీజీ అనుగ్ర‌హ భాష‌ణం చేస్తూ భూలోక వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమ‌ల‌లో వేద‌ప్ర‌తిపాద్యుడైన శ్రీ‌వారి స‌న్నిధిలో లోక‌క‌ల్యాణం కోసం వేద‌పారాయ‌ణం నిర్వ‌హించ‌డం గొప్ప విష‌య‌మ‌న్నారు. ఏప్రిల్ 13 నుండి వేద‌పారాయ‌ణం జ‌రుగుతోంద‌ని, కృష్ణ‌య‌జుర్వేద పారాయ‌ణం పూర్త‌యింద‌ని, ప్ర‌స్తుతం జ‌ఠా పారాయ‌ణం జ‌రుగుతోంద‌ని, అనంత‌రం ఘ‌న పారాయ‌ణం నిర్వ‌హిస్తార‌ని చెప్పారు. ధ‌ర్మాచార‌ణ‌తో సుఖం, ఐశ్వ‌ర్యం, విద్య‌, ఆరోగ్యం ప్రాప్తిస్తాయ‌న్నారు. ధ‌ర్మానికి మూలం వేదం అని, ఇది భ‌గ‌వంతుని స్వ‌రూప‌మ‌ని అన్నారు. ప్ర‌తి ఒక్క‌రూ స‌త్య‌మార్గంలో న‌డ‌వాల‌ని, అప్ప‌డే విజ‌యం చేకూరుతుంద‌ని వివ‌రించారు. ప్ర‌తి గ్రామంలో వేద ఘోష వినిపించాల‌ని స్వామీజీ ఆకాంక్షించారు.
 టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, బోర్డు స‌భ్యులు శ్రీ శేఖ‌ర్‌రెడ్డి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, పేష్కార్ శ్రీ జ‌గ‌న్మోహ‌నాచార్యులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.