KAPILESWARA GRACES ON CHANDRAPRABHA _ చందప్రభ వాహనంపై శ్రీకపిలేశ్వరస్వామి వారి అభయం
TIRUPATI, 02 MARCH 2024: As a part of the ongoing annual brahmotsavams in Kapileswara Swamy temple in Tirupati, on the third day evening the devotees witnessed Sri Kapileswara on Chandraprabha Vahanam on Saturday.
DyEO Sri Devendra Babu, AEO Sri Subbaraju and others were present.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
చందప్రభ వాహనంపై శ్రీకపిలేశ్వరస్వామి వారి అభయం
తిరుపతి, 2024, మార్చి 02: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజైన శనివారం రాత్రి శ్రీ కపిలేశ్వర స్వామివారు చంద్రప్రభ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. భజనమండళ్ల కోలాటాలు, భజనలు, మంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు.
శివుడు అష్టమూర్తి స్వరూపుడు. సూర్యుడు, చంద్రుడు, భూమి, నీరు, అగ్ని, వాయువు ఆకాశం, యజమానుడు శివుడి ప్రత్యక్షమూర్తులు. చంద్రుడు అమృతమూర్తి. వెన్నెల కురిపించి జీవకోటి మనస్సులకు ఆనందాన్ని కలిగించే షోడశకళాప్రపూర్ణుడు. శివభగవానుడు విభూతి సౌందర్యంతో ధవళతేజస్సుతో వెలుగొందుతూ తన కరుణ కిరణాలతో అమృత శీతలకాంతులను జీవులకు అనుగ్రహిస్తాడు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ దేవేంద్ర బాబు, ఏఈఓ శ్రీ సుబ్బరాజు, సూపరింటెండెంట్ శ్రీ భూపతి, టెంపుల్ ఇన్స్ పెక్టర్లు శ్రీ రవికుమార్, శ్రీ బాలకృష్ణ, విశేషంగా భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.