KAPILESWARA RIDES NANDI VAHANA _ నంది వాహనంపై కైలాసనాథుడు

THOUSANDS OF DEVOTEES LINE UP ALONG STREETS

Tirupati, 21 Feb. 20: Ahead of extended Maha Shivaratri rituals for Friday night, the TTD organised a spectacular Nandi vahanam on which Sri Soma Skandamurthy and His consort Kamakshi Devi moved ahead across the streets of temple town blessing the devotees.

The devotees shouted with religious ecstasy “Hara Hara Maha Deva Sambho Shankara” all along the procession.

The colourful, procession with bhajan and kolata teams and Mangala vaidyams caught the attention of citizens of Tirupati.

TTD EO Sri Anil Kumar Singhal, JEO Sri P Basant Kumar, CVSO Sri Gopinath Jatti took part in the celestial procession.

DyEO Sri Subramanyam, superintendent Sri Bhupathi Raju, temple inspectors Sri Reddy Sekhar and Sri Srinivas Naik and others participated.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI  

 

 

నంది వాహనంపై కైలాసనాథుడు

విశేషంగా దర్శించుకున్న భక్తులు

తిరుపతి, 2020 ఫిబ్ర‌వ‌రి 21: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహాశివరాత్రి పర్వదినాన్ని శుక్ర‌వారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయంత్రం 6 నుండి రాత్రి 10 గంటల వరకు నంది వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ కపిలేశ్వరస్వామి, శ్రీకామాక్షి అమ్మవారిని దర్శించుకున్నారు. తిరుపతి పురవీధుల్లో ఈ వాహనసేవ జరిగింది.

ఈ కార్యక్రమంలో టిటిడి ఈఓ శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, జెఈఓ శ్రీ పి.బసంత్ కుమార్, సివిఎస్వో శ్రీ గోపీనాధ్ జెట్టి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, ప్ర‌ధానార్చ‌కులు శ్రీ మ‌ణిస్వామి, సూపరింటెండెంట్‌ శ్రీ భూప‌తిరాజు, ఎవిఎస్వోలు శ్రీ నందీశ్వ‌ర‌రావు, శ్రీ సురేంద్ర, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ రెడ్డిశేఖ‌ర్‌, శ్రీ శ్రీ‌నివాస్‌నాయ‌క్ ఇత‌ర అధికారులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.