KARTHIKA DEEPOTSAVAM ON NOV 13_ నవంబరు 13న కార్తీక దీపోత్సవం

Tirupati, 12 Nov. 17: The HDPP wing of TTD will observe Karthika Deepotsavam in the temple of Sri Bramaramba Mallikarjuna Swamy temple in LS Nagar in Tirupati on Monday.

There will be special programs from 5am onwards on November 13 and the Festival of Lights will be observed after 6pm onwards.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

నవంబరు 13న కార్తీక దీపోత్సవం

నవంబరు 12, తిరుపతి, 2017: టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో నవంబరు 13వ తేదీ సోమవారం నాడు తిరుపతిలోని ఎల్‌ఎస్‌ నగర్‌లో గల శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామివారి ఆలయంలో కార్తీక దీపోత్సవం నిర్వహించనున్నారు.

ఈ ఆలయంలో ఉదయం 6 గంటలకు నగర సంకీర్తన, ప్రసాద వితరణ చేస్తారు. సాయంత్రం 5 గంటల నుంచి భక్తి సంగీతం, ధార్మికోపన్యాసం అనంతరం సాయంత్రం 6 గంటలకు కార్తీక దీపోత్సవం నిర్వహిస్తారు. ఆ తరువాత హరికథా కార్యక్రమం ఉంటుంది. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి కార్తీక దీపాలు వెలిగించి భగవంతుని కృపకు పాత్రులు కావాలని కోరడమైనది.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.