KARTHIKA PARVA DEEPOTSAVAM IN TIRUMALA ON DEC 7 _ డిసెంబర్ 7న తిరుమలలో కార్తీక పర్వ దీపోత్సవం 

POURNAMI GARUDA SEVA ON DEC 8

TIRUMALA, 06 DECEMBER 2022: The Karthika Parva Deepotsavam will be observed in Tirumala temple on December 7 between 5pm and 8pm.

TTD has cancelled Sahasra Deepalankara Seva in this connection.

Monthly Pournami Garuda Seva will be observed in Tirumala on December 8 between 7pm and 9pm.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

డిసెంబర్ 7న తిరుమలలో కార్తీక పర్వ దీపోత్సవం
 
తిరుమ‌ల‌, 2022 డిసెంబర్ 06: తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 7వ తేదీన సాలకట్ల కార్తీక పర్వదీపోత్సవాన్ని టిటిడి ఘనంగా నిర్వహించనుంది. కార్తీక పౌర్ణ‌మినాడు శ్రీవారికి సాయంకాల కైంకర్యాలు, నివేదనలు పూర్తి అయిన తరువాత ఈ దీపోత్సవం నిర్వహిస్తారు.
 
ఈ సందర్భంగా సాయంత్రం 5 నుండి 8 గంటల వరకు నేతి వత్తులతో దీపాలను వెలిగించి ఛత్రచామర, మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేస్తూ, ఆనందనిలయంలో శ్రీవారికి హారతి ఇస్తారు. ఆతర్వాత వరుసగా గర్భాలయంలో అఖండం, కులశేఖరపడి, రాములవారిమేడ, ద్వారపాలకులు, గరుడాళ్వారు, వరదరాజస్వామి సన్నిధి, వకుళమాత, బంగారుబావి, కల్యాణమండపం, సభఅర, తాళ్లపాక అర, భాష్యకారుల సన్నిధి, యోగనరసింహస్వామి, విష్వక్సేనులు, చందనం అర, పరిమళం అర, వెండివాకిలి, ధ్వజస్తంభం, బలిపీఠం, క్షేత్రపాలకుల సన్నిధి, తిరుమలరాయ మండపం, పూలబావి, రంగనాయక మండపం, మహాద్వారం, బేడి ఆంజనేయస్వామి, శ్రీవరాహస్వామి ఆలయం, స్వామి పుష్కరిణి వద్ద దీపాలను ఏర్పాటు చేస్తారు.   
 
ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో సహస్రదీపాలంకరణ సేవను టిటిడి రద్దు చేసింది.
 
డిసెంబర్ 8న పౌర్ణమి గరుడసేవ :
 
డిసెంబర్ 8వ తేదీ కార్తీక పౌర్ణమి సందర్భంగా పౌర్ణమి గరుడసేవ జరుగనుంది. రాత్రి 7 నుండి 9 గంట‌ల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు  గ‌రుడునిపై తిరుమాడ వీధులలో విహ‌రిస్తూ భక్తులకు దర్శనమిస్తారు.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.