KARTHIKA PARVA DEEPOTSAVAM IN TIRUMALA TEMPLE ON NOVEMBER 24 _ నవంబర్ 24న తిరుమలలో కార్తీక పర్వ దీపోత్సవం
MONTHLY GARUDA SEVA STANDS CANCELLED
Tirumala, 22 November 2026: The Salakatla Karthika Parva Deepotsavam will be observed in the Tirumala Temple on November 24.
The Deepotsavam will be performed after completion of the evening rituals and offerings to Sri Venkateswara Swamy on the occasion of Karthika Pournami.
In view of this, the monthly Pournami Garuda Seva and Sahasra Deepalankara Seva have been cancelled on that day.
On this occasion, lamps with ghee wicks will be lit inside, all around the temple and sub temples from 5 PM to 8.30 PM. The entire hill shine premises dons a unique look under the festival of lights providing a celestial feast to the eyes of devotees.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
నవంబర్ 24న తిరుమలలో కార్తీక పర్వ దీపోత్సవం
కార్తీక పౌర్ణమి గరుడ సేవ రద్దు
తిరుమల, 2026 నవంబర్ 22: తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబర్ 24వ తేదీన సాలకట్ల కార్తీక పర్వదీపోత్సవాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించనుంది. కార్తీక పౌర్ణమినాడు శ్రీవారికి సాయంకాల కైంకర్యాలు, నివేదనలు పూర్తి అయిన తరువాత ఈ దీపోత్సవం నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా సాయంత్రం 5 గంటల నుండి 8.30 గంటల వరకు నేతి వత్తులతో దీపాలను వెలిగించి ఛత్రచామర, మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేస్తూ ఆనంద నిలయంలో శ్రీవారికి హారతి ఇస్తారు. ఆ తర్వాత వరుసగా గర్భాలయంలో అఖండం, కులశేఖర పడి, రాములవారి మేడ, ద్వార పాలకులు, గరుడాళ్వారు, వరదరాజస్వామి సన్నిధి, వకుళమాత, బంగారుబావి, కల్యాణ మండపం, సభ అర, తాళ్లపాక అర, భాష్యకారుల సన్నిధి, యోగ నరసింహస్వామి, విష్వక్సేనులు, చందనం అర, పరిమళం అర, వెండి వాకిలి, ధ్వజస్తంభం, బలి పీఠం, క్షేత్ర పాలకుల సన్నిధి, తిరుమలరాయ మండపం, పూలబావి, రంగనాయక మండపం, మహాద్వారం, బేడి ఆంజనేయస్వామి, శ్రీవరాహస్వామి ఆలయం, స్వామి పుష్కరిణి వద్ద దీపాలను ఏర్పాటు చేస్తారు.
పౌర్ణమి గరుడ సేవ రద్దు:
ప్రతి నెలా టీటీడీ పౌర్ణమినాడు నిర్వహించే గరుడ సేవను ఈ సందర్భంగా రద్దు చేసింది. అదే విధంగా కార్తీక దీపోత్సవం కారణంగా సహస్ర దీపాలంకరణ సేవను కూడా ఆ రోజు రద్దు చేసింది.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.
