KARTHIKA PARVA DEEPOTSAVAM ON DEC 11 _ డిసెంబరు 11న తిరుమలలో కార్తీక పర్వ దీపోత్సవం
Tirumala, 10 Dec. 19: The annual Karthika Parva Deepotsavam will be observed in a colourful manner at Tirumala temple on December 11.
TTD is all set to observe this festival of lights on Wednesday evening between 5pm and 8pm. The entire temple will be decked with ghee lit lamps which will provide a cynosure to the devotees.
TTD has cancelled Sahasra Deepalankara Seva and monthly Pournami Garuda Seva in view of the Karthika Deepotsavam.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
డిసెంబరు 11న తిరుమలలో కార్తీక పర్వ దీపోత్సవం
డిసెంబరు 10, తిరుమల, 2019: తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు 11వ తేదీన సాలకట్ల కార్తీక పర్వదీపోత్సవాన్ని టిటిడి ఘనంగా నిర్వహించనుంది. కార్తీక పౌర్ణమినాడు శ్రీవారికి సాయంకాల కైంకర్యాలు, నివేదనలు పూర్తి అయిన తరువాత ఈ దీపోత్సవం నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా సాయంత్రం 5 నుండి 8 గంటల వరకు నేతి వత్తులతో దీపాలను వెలిగించి ఛత్రచామర, మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేస్తూ, ఆనందనిలయంలో శ్రీవారికి హారతి ఇస్తారు. ఆతర్వాత వరుసగా గర్భాలయంలో అఖండం, కులశేఖరపడి, రాములవారిమేడ, ద్వారపాలకులు, గరుడాళ్వారు, వరదరాజస్వామి సన్నిధి, వకుళమాత, బంగారుబావి, కల్యాణమండపం, సభఅర, తాళ్లపాక అర, భాష్యకారుల సన్నిధి, యోగనరసింహస్వామి, విష్వక్సేనులు, చందనం అర, పరిమళం అర, వెండివాకిలి, ధ్వజస్తంభం, బలిపీఠం, క్షేత్రపాలకుల సన్నిధి, తిరుమలరాయ మండపం, పూలబావి, రంగనాయక మండపం, మహాద్వారం, బేడి ఆంజనేయస్వామి, శ్రీవరాహస్వామి ఆలయం, స్వామి పుష్కరిణి వద్ద దీపాలను ఏర్పాటు చేస్తారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో సహస్రదీపాలంకరణ సేవను టిటిడి రద్దు చేసింది.
పౌర్ణమి గరుడసేవ రద్దు :
కార్తీక పర్వదీపోత్సవాన్ని పురస్కరించుకుని డిసెంబరు 11న శ్రీవారి ఆలయంలో పౌర్ణమి గరుడ సేవ రద్దయింది. ఈ విషయాన్ని భక్తులు గమనించగలరు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.