KARTHIKA VANA BHOJANAM AT SRINIVASA MANGAPURAM TEMPLE ON DECEMBER 11 _ డిసెంబరు 11న శ్రీనివాసమంగాపురంలో కార్తీక వనభోజనం
Tirupati, 8 Dec. 20: As part of tradition, TTD will be organising Karthika Vana Bhojanam on December 11 but in Ekantam following Covid guidelines.
As part of the fete the utsava idols of Sri Kalyana Venkateswara and His consorts Sri Devi and Sri Bhudevi will be offered Snapana Tirumanjanam in the Kalyana Mandapam.
After the alankaram and vana bhojanam the artists of Annamacharya project present devotional sankeertans. TTD has cancelled Kalyanotsavam on that day.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
డిసెంబరు 11న శ్రీనివాసమంగాపురంలో కార్తీక వనభోజనం
తిరుపతి, 2020 డిసెంబరు 08: టిటిడికి అనుబంధంగా ఉన్న శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబరు 11న శుక్రవారం కార్తీక వనభోజన కార్యక్రమం జరుగనుంది. కోవిడ్-19 నిబంధనల నేపథ్యంలో ఈ ఉత్సవాన్ని ఆలయంలో ఏకాంతంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవం కారణంగా కల్యాణోత్సవం ఆర్జిత సేవ రద్దయింది. పవిత్రమైన కార్తీక మాసంలో ద్వాదశి నాడు ఇక్కడ వనభోజన కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
ఇందులో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులను ఆలయంలోని కల్యాణ మండపానికి వేంచేపు చేస్తారు. ఉదయం 10 నుంచి 11 గంటల వరకు స్నపనతిరుమంజనం వేడుకగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. ఆ తరువాత అలంకారం, వనభోజనం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు భక్తి సంగీత కార్యక్రమం నిర్వహిస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.