KARTHIKA VANA BHOJANAM IN TIRUMALA ON NOVEMBER 5_ నవంబరు 5న తిరుమలలో కార్తీక వన భోజనం

Tirumala, 3 November 2017: The Karthika Vanabhojanam will be organised in Paruveta Mandapam on November 5 in Tirumala.

Earlier during the day, the Lord Malayappa Swamy on Small Gaja Vahanam with His two consorts Sridevi and Bhudevi on separate Tiruchi will be brought to the Paruveta Mandapam and Snapana Tirumanjanam is performed to the deities.

Later between 1pm and 3pm Karthika Vanabhojanam is observed and tens of thousands of devotees will take part in this fete.

TTD is making elaborate food and water arrangements along with security for this fete.

Meanwhile Karthika Pournami Garuda Seva will be observed on November 4.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

నవంబరు 5న తిరుమలలో కార్తీక వన భోజనం

నవంబరు 3, తిరుమల 2017: కార్తీక వన భోజన కార్యక్రమం నవంబరు 5వ తేది ఆదివారం తిరుమలలోని గోగర్భం సమీపంలో గల పార్వేటమండపంలో జరుగనుంది. పవిత్రమైన కార్తీకమాసంలో వనభోజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

ఇందులో భాగంగా ఉదయం 8.30 గంటలకు శ్రీ మలయప్పస్వామివారు చిన్న గజవాహనంపై ఉభయనాంచారులు పల్లకిపై ఆలయంనుంచి బయలుదేరి ఊరేగింపుగా పార్వేటమండపానికి వేంచేపు చేస్తారు. ఉదయం 11 నుండి 12 గంటల నడుమ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహిసారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. అటు పిమ్మట మధ్యాహ్నం 1 నుండి 3 గంటల నడుమ కార్తీక వనభోజన కార్యక్రమం నిర్వహిస్తారు.

ఈ ఉత్సవం కారణంగా శ్రీవారి అలయంలో నిర్వహించు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జితబ్రహ్మూెత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకారసేవలను తి.తి.దే రద్దు చేసింది.

ఈ కార్యక్రమంలో తి.తి.దే ఉన్నతాధికారులు మరియు సిబ్బంది పాల్గొంటారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.