KAVI SAMMELAN HELD WITH APLOMB _ రామనామస్మరణతో సాగిన కవి సమ్మేళనం

Vontimitta, 17 April 2024: As part of Vontimitta Sri Kodanda Ramalaya Brahmotsavam, a literary meet, Kavi Sammelanam was held on Wednesday under the auspices of Hindu Dharma Prachara Parishad of TTD to celebrate the Jayanti fete of renowned Telugu Poet Sri Bammera Potana.

The program was presided over by Sri. Rajagopal, Program Officer, All Projects of TTD.

TTD Dasa sahitya Project Special Officer Sri Ananda Theerthacharyulu was the chief guest.  In the Kavi Sammelan organized on this occasion, Sri. Shankar, Sri Narayana Reddy, Dr. Neelaveni, Dr. Bhutapuri Gopalakrishna Sastri, Sri Siva Reddy participated who spoke on a variety of subjects like Ranti Devuni Charitra, Kuchelopakhyanam, Sivadhanurbhangam, Gajendruni Akrandana and many others which allured literary lovers.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

 

రామనామస్మరణతో సాగిన కవి సమ్మేళనం

ఒంటిమిట్ట, 2024 ఏప్రిల్ 17: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్, ఆధ్వర్యంలో బుధ‌వారం బమ్మెర పోతన జన్మదినాన్ని పురస్కరించుకొని కవి సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి టీటీడీ అన్ని ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రాం అధికారి శ్రీ రాజగోపాల్ అధ్యక్షత వహించినారు.

ముఖ్యఅతిథిగా టీటీడీ దత్సహిత్య ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి ఆనందతీర్దాచ్యారుల పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కవి సమ్మేళనంలో శ్రీ పసుపులేటి శంకర్ పురాణం పైన వివరించారు. శ్రీ నారాయణరెడ్డి భాగవతంలోని గజేంద్రుని ఆక్రందన అనే అంశంపై ప్రసంగించారు. డాక్టర్ నీలవేణి రంతి దేవుని చరిత్ర, డాక్టర్ భూతపురి గోపాలకృష్ణ శాస్త్రి గారు భాస్కర రామాయణంలోని శివధనుర్బంగం మరియు సీత స్వయంవరంపై ప్రసంగించారు.

అదేవిధంగా శ్రీ ఎం శివారెడ్డి కుచేలోపాఖ్యానం పైన కవిత్వాన్ని చెప్పారు. భగవదా అనుగ్రహం లేకుండా ఏమి సాధించలేమని భగవదా అనుగ్రహానికి పాత్రులు కావాలని ఈ సందర్భంగా పాల్గొన్న ప్రముఖ కవులు తెలియజేశారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.