DWAJAROHANAM AT BUT OF KEELAPATLA SRI KONETIRAYULU TEMPLE_ ధ్వజారోహణంతో కీలపట్ల శ్రీ కోనేటిరాయస్వామివారి వార్షిక బ్రహ్మూెత్సవాలు ప్రారంభం
Tirupati, 23 April 2018: The Annual Brahmotsavam of TTD sub temple Sri Konetirayulu temple at Keelapatla in Chittoor Dist commenced with grand dwajarohanam event and the Sesha vahanam in the evening. Following are schedule of events of the Brahmotsavam.
Date Morning Evening
23-04-2018 Dwajarohanam (Muthuna lagnam) Sesha Vahanam
24-04-2018 Tiruchi utsavam Hamsa vahanam
25-04-2018 Simha Vahanam Muthyapu pandiri Vahanam
26-04-2018 Kalpavruksha Vahanam Sarvabhoopala Vahanam
27-04-2018 Pallaki Utsavam Kalyanotsavam Garuda vahanam
28-04-2018 Hanumantha Vahanam Vasantotsavam Gaja vahanam
29-04-2018 Suryaprabha Vahanam Chandraprabha Vahanam
30-04-2018 Rathotsavam Aswa vahanam
01-05-2018 Chakrasnanam Dwajarohanam
As part of the BTU Kalyanotsavam will be performed on April 27 at 4pm and interested devotee couple could participate by paying Rs.300 and beget prasadam of one Uttariam, one blouse, annaprasadam. TTD also had plans for a Pushpa yagam on May 2 at the venue.
The artists of HDPP, Dasa Sahitya project, Annamacharya Project will perform harikatha ganam, kolatas, bhakti sangeet programs etc during the BTU.
Among others DyEO of Srinivasa Mangapuram Sri Venkatayya, Sri AK Narasimha charyalu (Khadri Swami Kankana bhattar) Sri Krishna Sai and other officials participated in the event.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATHI
ధ్వజారోహణంతో కీలపట్ల శ్రీ కోనేటిరాయస్వామివారి వార్షిక బ్రహ్మూెత్సవాలు ప్రారంభం
ఏప్రిల్ 23, తిరుపతి, 2018: టిటిడికి అనుబంధంగా ఉన్న చిత్తూరు జిల్లా కీలపట్లలోని శ్రీ కోనేటిరాయస్వామివారి వార్షిక బ్రహ్మూెత్సవాలు సోమవారం ఉదయం ధ్వజారోహణం కార్యక్రమం వైభవంగా ప్రారంభమయ్యాయి. సాయంత్రం స్వామివారు శేషవాహనంపై ఊరేగి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
తేదీ ఉదయం సాయంత్రం
23-04-2018(సోమ) ధ్వజారోహణం(మిథునలగ్నం) శేష వాహనం
24-04-2018(మంగళ) తిరుచ్చిఉత్సవం హంస వాహనం
25-04-2018(బుధ) సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం 26-04-2018(గురు) కల్పవ క్ష వాహనం సర్వభూపాల వాహనం
27-04-2018(శుక్ర) పల్లకీ ఉత్సవం కల్యాణోత్సవం, గరుడ వాహనం
28-04-2018(శని) హనుమంత వాహనం వసంతోత్సవం, గజ వాహనం
29-04-2018(ఆది) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
30-04-2018(సోమ) రథోత్సవం అశ్వవాహనం
01-05-2018(మంగళ) చక్రస్నానం ధ్వజావరోహణం
ఉత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 27వ తేదీ సాయంత్రం 4 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం జరుగనుంది. గ హస్తులు(ఇద్దరు) రూ.300/- చెల్లించి కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు. మే 2వ తేదీ సాయంత్రం 5 గంటలకు పుష్పయాగం వైభవంగా నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా హిందూ ధర్మప్రచార పరిషత్, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ భక్తి సంగీత కార్యక్రమం, హరికథాగానం, కోలాటాలు తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీనివాసమంగాపురం ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ వెంకటయ్య, శ్రీ ఏ.కే. నరసింహాచార్యులు (ఖాద్రి స్వామి), కంకణభట్టారు శ్రీ కృష్ణసాయి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.