KODANDARAMA IN VATAPATRASHAYI ALANKARAM _ వటపత్రశాయి అలంకారంలో కోదండరాముని కటాక్షం

Vontimitta, 23 Apr. 21: On the third day of the ongoing annual Brahmotsavam of Sri Kodandaramaswamy temple, devotees were blessed by Lord in Vatapatrashayi alankaram held in ekantham in view of Covid guidelines.

Legends depicted the episode of Maha Vishnu as a child floating on a big banyan leave during a cyclone and later in Sri Rama avatar for resurrecting humanity as narrated by Annamacharya in his sankeetans.

Temple AEO Sri Muralidhar, Superintendents Sri Venkatachalapathi, Sri Venkateshaiah, Temple inspector Sri Dhananjaeyulu and others were present.

 ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

వటపత్రశాయి అలంకారంలో కోదండరాముని కటాక్షం

ఒంటిమిట్ట, 2021 ఏప్రిల్ 23: ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడ‌వ‌‌ రోజు శుక్ర‌వారం ఉదయం వటపత్రశాయి అలంకారంలో స్వామివారు కటాక్షించారు. కోవిడ్ -19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా వాహ‌న‌సేవ నిర్వ‌హించారు.

పురాణాల ప్రకారం.. జలప్రళయం సంభవించినపుడు శ్రీమహావిష్ణువు మర్రి ఆకుపై తేలియాడుతూ శిశువుగా దర్శనమిస్తారు. కుడికాలి బొటనవేలిని నోటిలో పెట్టుకుని ఆస్వాదిస్తుంటారు. ఈ ఘట్టాన్ని గుర్తుచేస్తూ శ్రీమహావిష్ణువు అవతారమైన శ్రీరాముడు భక్తులకు కనువిందు చేశారు.

భక్తుల కష్టాలను కడతేర్చేందుకు ఎప్పుడూ ముందుంటానని స్వామివారు ఈ అలంకారం ద్వారా తెలియజేస్తున్నారు. వటపత్రశాయి మహిమను అన్నమయ్య తన సంకీర్తనల్లో చక్కగా వర్ణించారు.

ఈ కార్యక్రమంలో ఏఈవో శ్రీ ముర‌ళీధ‌ర్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ ధ‌నంజ‌యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.