KODANDARAMA ON FLOAT BLESSES DEVOTEES_ తెప్పలపై శ్రీ కోదండరాముని అభయం
Tirupati, 30 March 2018: The Second day of the annual Teppotsavam of the Sri Kodandarama swamy Temple were grandly performed on Friday. The utsava idols were given snapana thirumanjanam in the morning with MIlk, Curd, Honey, Turmeric and Sandal water, Coconut water.
In the evening the utsava idols of Sri Sita and Sri Rama will be taken in a procession to the Ramachandra Pushkarini and Teppotsavam will be performed till 8.30pm. The superbly decorated float with electrical lighting and flowers will take seven rounds to bless the devotees.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
తెప్పలపై శ్రీ కోదండరాముని అభయం
తిరుపతి, 30 మార్చి 2018: తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి తెప్పోత్సవాలు శుక్రవారం రెండో రోజు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా ఉదయం 9.30 నుండి 11 గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు.
సాయంత్రం 6 గంటలకు ఆలయం నుండి శ్రీ సీతారాముల ఉత్సవమూర్తులను రామచంద్ర పుష్కరిణికి వేంచేపు చేస్తారు. రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు తెప్పోత్సవం నిర్వహిస్తారు. విద్యుద్దీపాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీ సీతారామలక్ష్మణులు ఆశీనులై ఏడుచుట్లు తిరిగి భక్తులను అనుగ్రహిస్తారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.