Kodandarama Swamy rides Gaja Vahanam _  గజ వాహనంపై శ్రీ సీతారాములు

Vontimitta, 22 April 2024:The Sixth day evening Sri Kodandarama Swamy took out a celestia on Gaja Vahanam as a part of ongoing annual Brahmotsavam on Monday.

After Sri Sitarama Kalyanam, Gajavahanam was held.

TTD officials were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

గజ వాహనంపై శ్రీ సీతారాములు

ఒంటిమిట్ట, 2024 ఏప్రిల్ 22: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు సోమవారం రాత్రి  శ్రీ సీతారాముల కల్యాణం తరువాత గజవాహనంపై శ్రీ సీతారాములు భక్తులను కటాక్షించారు.

సీతారాములు మాత్రమే కలిసి విహరించే ఈ గజ వాహనానికి ఎంతో విశిష్టత ఉంది.

రాజసానికి ప్రతీక మదగజం. రణరంగంలో, రాజదర్బారుల్లో, ఉత్సవాల్లో గజానిదే అగ్రస్థానం. గజేంద్రుడు రాములవారిని వహించునట్లు, భక్తులు సదా కోదండరాముని హృదయ పీఠికపై వహించి స్వామికృపకు పాత్రులుకాగలరు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది