KODANDARAMA TAKES MAJESTIC RIDE ON GARUDA _ గరుడ వాహనంపై సీతాపతి 

TIRUPATI, 24 MARCH 2023: Sri Kodandarama in all His celestial splendour took out a majestic ride on the mighty Garuda Vahana on the fifth day evening of the ongoing annual brahmotsavam in Sri Kodandarama Swamy Temple at Tirupati.

The pleasant evening on Friday witnessed a huge gathering of devotees who thronged to catch a glimpse of Lord Sri Rama on Garuda Vahana. Every inch of the mada streets were occupied by devotees rendering Haratis to Lord.

The devotional cultural performances by various artistes’ troupes in front of Vahanam, enhanced the glory of the mega-religious event.

Tirumala Pedda Jeeyangar Swamy accompanied by his Junior seer, JEO Sri Veerabrahmam, DyEO Smt Nagaratna, AEO Sri Mohan, Kankanabhattar Sri Ananda Kumar Deekshitulu, Superintendent Sri Ramesh, temple inspectors Sri Suresh, Sri Chalapati and others were also present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

గరుడ వాహనంపై సీతాపతి
 
తిరుపతి, 2023 మార్చి 24: తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మూత్సవాల్లో భాగంగా ఐదో రోజు శుక్రవారం రాత్రి స్వామివారు గరుడ వాహనంపై భక్తులను అనుగ్రహించారు. రాత్రి 7 గంటలకు వాహన సేవ ప్రారంభమైంది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
 
నవాహ్నిక బ్రహ్మూత్సవాల్లో గరుడసేవ ముఖ్యమైనది. గరుత్మంతుడే శ్రీమహావిష్ణువుకు నిత్యవాహనం. దాసుడుగా, సఖుడుగా, విసనకఱ్ఱగా, చాందినిగా, ఆసనంగా, ఆవాసంగా, వాహనంగా ధ్వజంగా అనేక విధాల సేవలందిస్తున్న నిత్యసూరులలో అగ్రగణ్యుడైన వైనతేయుడు కోదండరామస్వామిని వహించి కదిలే తీరు సందర్శనీయమైనది. 108 దివ్య దేశాలలోనూ గరుడ సేవ విశిష్టమైనది.
 
వాహ‌న‌సేవ‌లో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయ‌ర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్‌స్వామి, జెఈఓ శ్రీ వీరబ్రహ్మం దంపతులు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న,  ఏఈవో శ్రీ మోహన్, కంకణబట్టర్ శ్రీ ఆనందకుమార్‌ దీక్షితులు, సూపరింటెండెంట్‌ శ్రీ రమేష్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ సురేష్ శ్రీ చలపతి, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
 
టీటీడీ  ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.