KOIL ALWAR AT SRIVARI TEMPLE ON SEP 15 _ సెప్టెంబరు 15న శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Tirumala, 14 Sep. 20: In consonance with Agama traditions, the ritual of Koil Alwar Tirumanjanam will be held at Srivari temple on September 15, as a precursor for the annual Brahmotsavams.

The holy cleansing of the Srivari temple takes place four times a year – particularly Tuesdays ahead of – Ugadi, Anivara Asthanam, Annual Brahmotsavams and Vaikuntha Ekadasi festivals.

The sacred ritual of cleansing will commence in the morning after Nitya pujas. As part of the Koil Alwar Tirumanjanam the entire temple complex including the roofs, walls, puja vessels are cleaned with herbs and a perfumed mixture called Parimalam.

In view of the COVID-19 restrictions, the event will be observed in Ekantkam from 6am onwards and lasts for nearly three hours on Tuesday. 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

సెప్టెంబరు 15న శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుమల, 2020 సెప్టెంబరు 14: తిరుమల శ్రీవారికి సెప్టెంబరు 19 నుండి 27వ తేదీ వ‌ర‌కు వార్షి‌క బ్రహ్మోత్సవాలు, అక్టోబ‌రు 16 నుండి 24వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించే న‌వ‌రాత్రి  బ్రహ్మోత్సవాల‌ను పురస్కరించుకుని సెప్టెంబరు 15వ తేదీ మంగళవారం ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు.

సాధారణంగా సంవత్సరంలో నాలుగు సార్లు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, వార్షిక బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, శుధ్ధి నిర్వహించనున్నారు. అనంతరం ఉదయం 6.00 నుండి 11.00 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరగనుంది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, గడ్డ కర్పూరం, సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు.

కోవిడ్ – 19 నిబంధ‌న‌ల మేర‌కు ఆల‌యంలో ఈ కార్య‌క్ర‌మాన్ని ఏకాంతంగా నిర్వ‌హించ‌నున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.