KOIL ALWAR HELD AT SRI TT_ శ్రీవారి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
Tirumala, 24 Sep. 19: The traditional cleansing fete, Koil Alwar Tirumanjanam was held in the Tirumala temple on Tuesday. TTD EO Sri Anil Kumar Singhal, Special Officer Sri AV Dharma Reddy and others took part in this religious event.
Later speaking to media outside temple, TTD EO said, usually this fete is observed four times in a year before annual Brahmotsavams, Anivara Asthanam, Telugu Ugadi and Vaikuntha Ekadasi. As the nine-day annual fete is going to be observed between September 30 to October 8, Koil Alwar Tirumanjanam was performed today from 6am till 10am. The significance behind this fete is to waive off the sins committed either knowingly or unknowingly by employees, religious staffs, devotees etc. and purify the entire temple premises with a herbal amalgamation called “Parimalam”.
“This Parimalam is applied on to the walls, roofs, pillars, in the main sanctum and also in other sub-shrines located in Tirumala temple by the employees. While doing this, the main deity will be covered with a veil and after the completion of cleansing of the temple and even the puja utensils, the veil is removed and prayers have been offered to the presiding deity and later the devotees were allowed for Darshan, the EO said.
Temple DyEO Sri Harindranath, Peishkar Sri Lokanatham and others were also present.
EO INSPECTS PUSHKARINI:
TTD EO Sri Anil Kumar Singhal, later inspected the beautification works of Swami Pushkarini along with Tirumala Special Officer Sri AV Dharma Reddy.
Speaking to media the EO said, all the arrangements for Brahmotsavams are completed and the departments have geared up for the big occasion.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
శ్రీవారి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుమల, 2019 సెప్టెంబరు 24: తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయ అర్చకులు, అధికారులు, సిబ్బంది ఆలయ శుద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబరు 30 నుండి అక్టోబరు 8వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్నాయని, ఇందుకు అవసరమైన ఏర్పాట్లన్ని పూర్తి చేసినట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాలు, ఉగాది, ఆణివార ఆస్థానం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఆలయంలోని ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ప్రసాదాల పోటు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పుతోపాటు పూజాసామగ్రిని శుద్ధి చేసినట్టు తెలిపారు.
కాగా, ఆలయంలో ఉదయం 6 నుండి ఉదయం 11 గంటల వరకు శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి వేశారు. శుద్ధి పూర్తి అయిన అనంతరం నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆ తరువాత భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి తిరుమల ప్రత్యేకాధికారి శ్రీ ఎ.వి.ధర్మారెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, పేష్కార్ శ్రీ లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.
శ్రీవారి పుష్కరిణి పరిశీలన :
అనంతరం టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, తిరుమల ప్రత్యేకాధికారి శ్రీ ఎ.వి. ధర్మారెడ్డితో కలిసి స్వామి పుష్కరిణి యొక్క సుందరీకరణ పనులను పరిశీలించి, పలు సూచనలు చేశారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.