KOIL ALWAR RITUALS AT SRI KAPILESWARA SWAMY TEMPLE_ శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Tirupati, 23 Feb. 19: Ahead of annual Brahmotsavams beginning on Monday, February 25th, Koil Alwar Thirumanjanam ritual was performed at the Sri Kapileswara Swamy Temple on Saturday morning.

As part of the ritual cleaning up commenced in Sanctum, Dhwajasthambham, sub temples after early morning pujas and public darshan began after 2.30pm.

DyEO of local temples Sri Subramanyam, AEO Sri Nagraj, Supdt Sri Raj Kumar, Temple Inspector Sri Reddy Sekhar and others participated.

ANKURARPANAM ON FEB 24

The holy ritual will be performed on Sunday, February 24 and Ahead of it a veedhi utsava of sri Vinayaka swamy on Mushaka vahanam will be held from 4.30pm to 6.30pm.

ALL SET FOR BRAHMOTSAVAM

All arrangements lime bright electrical, flower and Rangavalli arrangements have been completed. The cultural troupes will perform kolatas and bhajan programs in the morning and evening.

The grand nine-day festival from 25 February to March 6 included Dwajarohanam, Suryaprabha Vahanam, Bhutha Vahanam, Makara vahanam, Tiruchi Vahanam and VyagraVahanam, Kalpa Vruksha vahanam, Rathotsavam, Purusha Muruga Vahanam, Sri Nataraja Swami Ravanasura Vahanam, Surya Prabha vahanam and finally Dwaja Aavarohanam.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుపతి, 2019, ఫిబ్రవరి 23: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శ‌నివారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుంజనం ఘనంగా జరిగింది. ఫిబ్రవరి 25 నుండి మార్చి 6 వ తేదీ వరకు ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి.

ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి అభిషేకం నిర్వహించారు. ఆ తరువాత ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 2.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరిగింది. ఈ సందర్భంగా గర్భాలయం, ధ్వజస్తంభం, ఉప ఆలయాలు, ఆలయ పరిసరాలను శుద్ధి చేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, ఏఈవో శ్రీ నాగ‌రాజు, సూపరింటెండెంట్‌ శ్రీరాజ్‌కుమార్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టరు శ్రీ రెడ్డిశేఖ‌ర్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఫిబ్రవరి 24న శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

తిరుపతిలోని శేషాచల పర్వతమూలంలో వెలసిన శ్రీ కపిలేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 25 నుండి మార్చి 6వ తేదీ వరకు జరుగనున్న నేపథ్యంలో అంకురార్పణ కార్యక్రమం ఫిబ్రవరి 24న ఆదివారం శాస్త్రోక్తంగా జరుగనుంది. ఈ సందర్భంగా సాయంత్రం 4.30 నుండి 6.30 గంటల వరకు మూషిక వాహనంపై శ్రీవినాయకస్వామివారి వీధి ఉత్సవం నిర్వహించనున్నారు. సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు అంకురార్పణ జరుగనుంది.

ఏర్పాట్లు పూర్తి :

బ్రహ్మోత్సవాలకు ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. చలువ పందిళ్లు వేసి అందంగా రంగవల్లులు తీర్చిదిద్దారు. ప్రతిరోజూ వాహనసేవల ముందు కళాబృందాలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రతిరోజూ ఉదయం 7.00 నుండి 9.00 గంటల వరకు, తిరిగి రాత్రి 7.00 నుండి 9.00 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి.

ఫిబ్రవరి 25న ధ్వజారోహణం :

ఫిబ్రవరి 25వ తేదీ సోమ‌వారం ఉదయం 7.19 గంటలకు కుంభ లగ్నంలో ధ్వజారోహణం నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 9.00 నుంచి 11.00 గంటల వరకు పల్లకి ఉత్సవం, రాత్రి 7.00 నుంచి రాత్రి 9.00 గంటల వరకు హంస వాహన సేవ జరుగనున్నాయి.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
తేదీ ఉదయం సాయంత్రం

25-02-2019(సోమవారం) ధ్వజారోహణం(కుంభలగ్నం) హంస వాహనం

26-02-2019(మంగళవారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం

27-02-2019(బుధవారం) భూత వాహనం సింహ వాహనం
28-02-2019(గురువారం) మకర వాహనం శేష వాహనం

01-03-2019(శుక్రవారం) తిరుచ్చి ఉత్సవం అధికారనంది వాహనం

02-03-2019(శనివారం) వ్యాఘ్ర వాహనం గజ వాహనం

03-03-2019(ఆదివారం) కల్పవృక్ష వాహనం అశ్వవాహనం

04-03-2019(సోమవారం) రథోత్సవం(భోగితేరు) నందివాహనం

05-03-2019(మంగళవారం) పురుషామృగవాహనం కల్యాణోత్సవం, తిరుచ్చి ఉత్సవం

06-03-2019(బుధవారం) శ్రీనటరాజస్వామివారి రావణాసుర వాహనం,

సూర్యప్రభ వాహనం. ధ్వజావరోహణం.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.