KOIL ALWAR TIRUMANJANAM IN PAT ON SEP 10_ సెప్టెంబ‌రు 10న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలోకోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Tirupati, 9 Sep. 19: The traditional temple cleansing fete, Koil Alwar Tirumanjanam will be performed in Sri Padmavathi Ammavaru temple at Tiruchanoor on September 10.

As the annuall Pavitrotsavams will be observed from September 12-14, the entire temple will be cleansed with “Parimalam” on Tuesday.

After KAT between 6am and 8.30am, the devotees will be allowed for darshan of the presiding deity of Goddess Padmavathi.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

సెప్టెంబ‌రు 10న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలోకోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుపతి, 2019 సెప్టెంబరు 09: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యంలో సెప్టెంబ‌రు 12 నుండి 14వ తేదీ వ‌రకు వార్షిక ప‌విత్రోత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని సెప్టెంబ‌రు 10న మంగ‌ళ‌వారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జ‌రుగ‌నుంది.

ఈ సంద‌ర్భంగా శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారిని ఉదయం సుప్రభాతంతో మేల్కొలిపి స‌హ‌స్ర‌నామార్చ‌న నిర్వ‌హిస్తారు. ఆ త‌రువాత ఉదయం 6 నుండి 8.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేపడ‌తారు. ఇందులోభాగంగా ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేస్తారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం ఉదయం 9 గంటల నుండి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు.

ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం కార‌ణంగా ఆర్జితసేవలైన కల్యాణోత్సవం, ఊంజలసేవను టిటిడి రద్దు చేసింది.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.