KOIL ALWAR TIRUMANJANAM AT SRI VENUGOPALA SWAMY TEMPLE ON JUNE 2 _ జూన్ 2న శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

Tirupati, May 30, 2026: Koil Alwar Tirumanjanam will be observed at Sri Venugopalaswamy Temple, along with Sri Rukmini and Satyabhama Ammavars, at Karvetinagaram on June 2 from 7.30 a.m. to 11 a.m. ahead of the annual Brahmotsavams.

The annual Brahmotsavams will be held from June 6 to 14. As part of temple tradition, the temple premises, walls, ceiling and puja articles will be ceremonially cleansed and purified. Holy water mixed with aromatic ingredients will be sprinkled throughout the temple.

After the completion of the ritual, devotees will be allowed for Sarva Darshan from 11.30 a.m. onwards.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI                                                       

జూన్ 2 శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

తిరుపతి, 2026 మే 30: కార్వేటినగరంలోని శ్రీ రుక్మిణీ, సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు ముందు నిర్వహించే కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జూన్ 2వ తేదీ ఉదయం 7.30 గంటల నుండి 11 గంటల వరకు వైభవంగా జరుగనుంది. 

ఈ ఏడాది బ్రహ్మోత్సవాలు జూన్ 6 నుండి 14వ తేదీ వరకు నిర్వహించనున్నారు.

ఆలయ సంప్రదాయం ప్రకారం బ్రహ్మోత్సవాలకు ముందు ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితరాలను పవిత్ర జలాలతో శుద్ధి చేస్తారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీగడ్డ వంటి సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు.

ఈ మహోన్నత కార్యక్రమం అనంతరం ఉదయం 11.30 గంటల నుండి భక్తులను స్వామివారి సర్వ దర్శనానికి అనుమతించనున్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.