KOIL ALWAR TIRUMANJANAM AT SRIVARI TEMPLE ON DECEMBER 19 _ డిసెంబరు19న శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Tirumala, 18 December 2023: Ahead of the Vaikunta Ekadasi fete, TTD is organising the traditional temple cleansing fete, Koil Alwar Tirumanjanam at Srivari Temple on December 19.

Usually, this ritual is held before Ugadi, Anivara Asthanam, annual Brahmotsavam and Vaikunta Ekadasi in a year. This cleansing fete takes place between 6am and 10am. The darshan commences from 10.30am onwards.

In view of the fete, TTD has cancelled Asta dala padmaradhana Seva on the day.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

డిసెంబరు19న శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుమల, 2023 డిసెంబరు 18: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో డిసెంబరు 23న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పుర‌స్క‌రించుకుని డిసెంబరు 19వ తేదీన మంగళవారంనాడు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగనుంది.

సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. డిసెంబరు 19న ఉదయం 6 నుండి ఉదయం 10 గంటల వరకు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ఆలయంలోని ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుభ్రంగా కడుగుతారు. ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి వేస్తారు. శుద్ధి పూర్తి అయిన అనంతరం నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఉదయం 10.30 గంటల నుండి భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఈ కారణంగా అష్టదళ పాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.