KOIL ALWAR TIRUMANJANAM FOR UGADI PERFORMED _ శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

TIRUMALA, 29 MARCH 2022: The Koil Alwar Tirumanjanam in connection with Telugu Ugadi was performed at the hill shrine of Lord Venkateswara in Tirumala on Tuesday.

The Tirumanjanam was performed as a prelude to the Ugadi festival that occurs on April 2. All the utsava idols were temporarily removed from the sanctum sanctorum and the Mula Virat was provided with a waterproof covering before the priests carried out the cleansing rituals.

An aromatic herbal mixture of refined camphor, sandalwood powder, vermilion, turmeric and other ingredients that act as disinfectant was applied to all the walls and pillars inside the sanctum sanctorum as well as at other sub-temples inside the temple complex.

Employees took part in the cleaning ritual that lasted for about four hours. After 12-noon darshan resumed for pilgrims.

Prominent among those who took part in the ritual included Additional Executive Officer A.V. Dharma Reddy, Deputy EO Sri Ramesh Babu, VGO Sri Bali Reddy, temple Peishkar Sri Srihari.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుమల, 2022 మార్చి 29: తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 2న శుభ‌కృత్ నామ సంవ‌త్స‌ర ఉగాది ఆస్థానాన్ని పుర‌స్క‌రించుకుని మంగ‌ళ‌వారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది.

ఆలయంలో ఉదయం 6 నుండి 11 గంటల వరకు శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ప్రసాదాల పోటు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పుతోపాటు పూజాసామగ్రిని శుద్ధి చేశారు. ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి వేశారు. శుద్ధి పూర్తి అయిన అనంతరం నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆ తరువాత భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ రమేష్ బాబు, విజివో శ్రీ బాలిరెడ్డి, పేష్కార్ శ్రీ శ్రీ‌హ‌రి త‌దిత‌రులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.