KOIL ALWAR TIRUMANJANAM HELD AT SRIVARI TEMPLE _ శ్రీవారి ఆలయంలో ఆగమోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Tirumala,12 September 2023: The traditional fete of Koil Alwar Tirumanjanam( temple cleansing exercise ) was performed at Srivari Temple on Tuesday morning in view of upcoming annual Brahmotsavams beginning from September 18-26.

Speaking on the occasion the TTD Chairman Sri Bhumana Karunakar Reddy said all arrangements were made to ensure that pilgrims coming for Brahmotsavam fete are not put to any sort of inconvenience.

He said the holy temple cleansing program was performed four times a year ahead of important festivals like Ugadi, Anivara Asthana, Brahmotsavam and Vaikunta Ekadasi.

The program was observed from 6.00 am – 11.00 am and all sub-temples in the complex, Potu, walls and rooftops, all puja materials were cleansed with perfumed water, and a mixture called Parimalam.

Thereafter the veil covering the Mula Virat was removed special silks were adorned, special pujas performed and naivedyam offered before allowing pilgrims for darshan.

TTD EO Sri AV Dharma Reddy,TTD board members Sri Subbaraju ,Sri Tippeswami , CVSO Sri Narasimha Kishore,DLO Sri Veeraju ,SE- 2 Sri Jagadeeshwar Reddy, Dyeo Sri Lokanatham were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీవారి ఆలయంలో ఆగమోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుమల, 2023 సెప్టెంబర్ 12: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సెప్టెంబర్ 18 నుండి 26వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలను పుర‌స్క‌రించుకుని మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది.

ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీలోని అన్ని విభాగాలు సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారని చెప్పారు. ఈ సందర్భంగా కోయిల్ ఆళ్వార్‌ తిరుమంజనం శాస్త్రక్తంగా నిర్వహించినట్లు చైర్మన్ వివరించారు.

ఉదయం 6 నుండి 11 గంటల వరకు ఈ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రంగా చేశారు. ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచారు. శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేకపూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంత‌రం భక్తులను దర్శనానికి అనుమతించారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ ఈఓ శ్రీ ఏవి ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు శ్రీ సుబ్బరాజు, శ్రీ తిప్పేస్వామి, సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్‌, డి ఎల్ ఓ శ్రీ వీర్రాజు, ఎస్ ఇ -2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ లోకనాథం తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.