KOIL ALWAR TIRUMANJANAM ON AUGUST 29 IN SRI PAT_ ఆగస్టు 29న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Tirupati, 17 August 2017: In connection with annual pavitrotsavams from September 4 to 6, Koil Alwar Tirumanjanam will be observed on August 29 in the famous temple of Goddess Padmavathi Devi at Tiruchanoor.

After awakening the Goddess with Suprabhata Seva, this cleansing ritual will be performed between 6am to 8:30am. A scented mixture with aromatic ingredients including vermilion, turmeric, camphor, kichili root will be smeared on to the walls, roof of the temple and other sub-shrines.

Later from 9am on wards the devotees will be allowed for darshan.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

ఆగస్టు 29న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుపతి, 2017 ఆగస్టు 17: సెప్టెంబరు 4 నుండి 6వ తేదీ వరకు జరుగనున్న తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి వార్షిక పవిత్రోత్సవాలను పురస్కరించుకొని ఆగస్టు 29వ తేది మంగళవారం నాడు ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా నిర్వహించనున్నారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చాన, శుధ్ధి నిర్వహించనున్నారు.

అనంతరం ఉదయం 6.00 నుండి 8.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరగనుంది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రమిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను ఉదయం 9.00 గంటల నుండి సర్వదర్శనానికి అనుమతిస్తారు.

సెప్టెంబరు 4 నుండి 6వ తేదీ వరకు పవిత్రోత్సవాలు…

తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబరు 4 నుంచి 6వ తేదీ వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఈ ఉత్సవాలకు సెప్టెంబరు 3వ తేదీ సాయంత్రం అంకురార్పణం జరుగనుంది.

వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలిసితెలియక ఇటువంటి దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాలలో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా సెప్టెంబరు 4వ తేదీన పవిత్రప్రతిష్ఠ, సెప్టెంబరు 5న పవిత్ర సమర్పణ, సెప్టెంబరు 6న పూర్ణాహుతి కార్యక్రమాలు జరుగనున్నాయి. రూ.750/- చెల్లించి గృహస్తులు (ఒకరికి మూడు రోజులపాటు) ఈ పవిత్రోత్సవాల ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు 2 లడ్డూలు, 2 వడలు బహుమానంగా అందజేస్తారు.

పవిత్రోత్సవాల సందర్భంగా ఆగస్టు 29వ తేదీన మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని పురస్కరించుకుని కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, సెప్టెంబరు 3వ తేదీన అంకురార్పణం సందర్భంగా కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవలను రద్దు చేయనున్నారు. సెప్టెంబరు 4వ తేదీ సోమవారం పవిత్రోత్సవాల్లో మొదటిరోజు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, అష్టదళపాదపద్మారాధన, సెప్టెంబరు 5న రెండో రోజు మంగళవారం కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, సెప్టెంబరు 6న పవిత్రోత్సవాల్లో చివరిరోజు బుధవారం కల్యాణోత్సవం, ఆష్టోత్తర శతకళశాభిషేకం మరియు ఊంజల్‌సేవలను టిటిడి రద్దు చేయనుంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.