KOIL ALWAR TIRUMANJANAM ON JULY 11 _ శ్రీవారి ఆలయంలో జూలై 11న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

TIRUMALA, 04 JULY 2023: In connection with Anivara Asthanam on July 17, Koil Alwar Tirumanjanam will be observed on July 11 in Tirumala temple.

As part of this traditional temple cleansing ritual, the entire Tirumala shrine including roofs, walls are cleaned with Parimalam – an aromatic mixture.

This ritual is observed between 6am till 11am on that day. The devotees will be allowed for darshan after 12noon onwards.

TTD has cancelled Astadala Pada Padmaradhana on that day following the ritual.

TTD officials, Trust board members and temple staff participate in this ritual.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారి ఆలయంలో జూలై 11న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుమల, 2023 జూలై 04: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 11న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం టీటీడీ నిర్వహించనుంది. జూలై 17వ తేదీన ఆణివార ఆస్థానం సందర్భంగా ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.

సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

ఇందులో భాగంగా ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే తిరుమంజనం కార్యక్రమం సుమారు 5 గంటలపాటు కొనసాగనుంది. తిరుమంజనం కార్యక్రమం అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు ఆలయ అర్చకులు ఆగమోక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు.

అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుండి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు.

తిరుమంజనం కారణంగా మంగళవారంనాడు నిర్వహించే అష్టదళపాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది.

ఈ కార్యక్రమంలో టిటిడి ఉన్నతాధికారులు మరియు సిబ్బంది పాల్గొంటారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.