KOIL ALWAR TIRUMANJANAM ON MARCH 21 _ మార్చి 21న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
TIRUMALA, 13 MARCH 2023: In connection with Sri Sobhakrit Nama Ugadi, the traditional temple cleansing fete Koil Alwar Tirumanjanam will be performed on March 21.
The entire temple including the roof and walls of the sanctum sanctorum are cleansed with an aromatic mixture called Parimalam which will be smeared all along the premises.
This will be observed between 6am and 11am and devotees will be allowed for darshan from 12noon onwards.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
మార్చి 21న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుమల, 2023 మార్చి 13: తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 22వ తేదీన ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకొని మార్చి 21న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
ఉదయం 6 నుండి 11 గంటల వరకు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ఆలయంలోని ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుభ్రం చేస్తారు. ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి వేస్తారు. శుద్ధి పూర్తి అయిన అనంతరం నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 గంటల నుండి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.