KOIL ALWAR TIRUMANJANAM ON MARCH 25 AND UGADI ASTHANAM ON MARCH 30 _ మర్చి 25న కోయిల్ అల్వార్ తిరుమంజనం, 30న ఉగాది ఆస్థానం

NO VIP BREAK DARSHAN ON THESE DAYS

Tirumala, 17 March 2025: The traditional temple cleaning ritual, Koil Alwar Tirumanjanam will be observed by TTD on March 25 at Srivari Temple in connection with Sri Vishwavasu Nama  Telugu Ugadi on March 30.

Due to this, the TTD has cancelled the Astadala Pada Padmaradhana Seva at Srivari Temple on Tuesday.

Similarly, in view of Ugadi Asthanam on Sunday, all Arjita sevas except Sahasra Deepalankara Seva remains cancelled. 

On March 25 and 30 there will be VIP Break Darshans only for the protocol VIPs.  As such no recommendation letters for VIP Break Darshan will be accepted on March 24 and 29.

The devotees are requested to make note of these changes and co-operate with TTD.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

మర్చి 25న కోయిల్ అల్వార్ తిరుమంజనం, 30న ఉగాది ఆస్థానం

విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు

తిరుమల, 2025 మార్చి 17: ఈనెల 30వ తారీఖున విశ్వావసు నామ సంవత్సర తెలుగు ఉగాదిని పురస్కరించుకుని, టీటీడీ శ్రీవారి ఆలయంలో మార్చి 25వ తారీఖున కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించనుంది.

ఈ కారణంగా మంగళవారం శ్రీవారి ఆలయంలో నిర్వహించే అష్టదళ పాదపద్మారాధన సేవను టిటిడి రద్దు చేసింది.

అదే విధంగా, మార్చి 30 ఆదివారం నాడు శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని, సహస్ర దీపాలంకార సేవ మినహా అన్ని ఆర్జిత సేవలను రద్దు చేయడమైనది.

మార్చి 25 మరియు 30 తేదీలలో ప్రోటోకాల్ పరిధిలోని విఐపి లకు మాత్రమే విఇపి బ్రేక్ దర్శనాలు ఉంటాయి. ఈ కారణంగా మార్చి 24వ తారీఖున, అదే విధంగా మార్చి 29న విఐపి బ్రేక్ దర్శనాలకి సంబంధించి ఎటువంటి సిఫార్సు లేఖలను స్వీకరించడం జరగదు.

ఈ అంశాలని భక్తలు దృష్టిలో ఉంచుకొని టీటీడీకి సహకరించవలసిందిగా కోరడమైనది.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.