KOIL ALWAR TIRUMANJANAM PERFORMED _ భువ‌నేశ్వ‌ర్‌ శ్రీ‌వారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం

ALL SET FOR MAHA SAMPORKSHANA OF BHUBANESWAR SV TEMPLE ON MAY 26

 

Bhubaneswar, 25 May 2022: All arrangements are in place for the Maha Samprokshanam of the newly built Sri Venkateswara temple at Bhubaneswar in Odisha on May 26.

 

In connection with this fete, Koil Alwar Tirumanjanam was performed on Wednesday between 2pm and 4pm wherein the entire temple including roofs and walls were cleansed with an aromatic mixture called Parimalam.

 

Earlier during the day rituals like Ratnadhivasam, Vimana Kalasa Sthapana, Ratnanyasam, Peetharohanam and other Agama rituals performed. All these rituals were taken place under the supervision of Agama Advisor Dr Vedantam Vishnu Bhattacharyulu.

 

LAC Chief Sri Dushmant Kumar, JEO Sri Veerabrahmam, CE Sri Nageswara Rao, DyEO Sri Gunabhushan Reddy, All Projects Officer Sri Vijayasaradhi, AEO Sri Dorasami Naik, Superintendent Sri Mallikarjuna, Archakas were present.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

భువ‌నేశ్వ‌ర్‌ శ్రీ‌వారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం

తిరుపతి, 2022 మే 25: భువ‌నేశ్వ‌ర్‌లో టీటీడీ నిర్మించిన శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌య మ‌హాసంప్రోక్ష‌ణ కార్యక్రమాల్లో భాగంగా బుధ‌వారం మ‌ధ్యాహ్నం 2-30 గంటల నుండి సాయంత్రం 4-30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం నిర్వహించారు.

ఇందులో భాగంగా ఆలయాన్ని శుద్ధి చేసి, పసుపు, కుంకుమ, చందనం, సీకాయ, నామం, కర్పూరం, కిచిలిగడ్డ, కస్తూరి పసుపు, పచ్చాకు తదితరాలతో తయారుచేసిన సుగంధ మిశ్రమాన్ని గర్భాలయ గోడలకు ప్రోక్ష‌ణ చేశారు.

అంత‌కుముందు ఉద‌యం 8 నుండి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు పుణ్యాహవ‌చ‌నం, ర‌త్నాధివాసం, విమాన క‌ల‌శ స్థాప‌న‌, ర‌త్న‌న్యాసం, పీఠారోహ‌ణం, అష్ట‌బంధ‌నం, యాగ‌శాల వైదిక కార్యక్ర‌మాలు నిర్వహించారు. సాయంత్రం 5 నుండి 6.30 గంట‌ల వ‌ర‌కు మ‌హాశాంతి అభిషేకం, రాత్రి 7 నుండి 11 గంట‌ల వ‌ర‌కు కుంభారాధ‌న, నివేద‌న‌, శ‌య‌నాధివాసం, హౌత్రం, స‌ర్వ‌దేవ‌తార్చ‌న‌, విశేష హోమాలు, యాగ‌శాలలో వైదిక‌ కార్య‌క్ర‌మాలు చేపట్టారు.

ఈ కార్య‌క్రమాల్లో స్థానిక సలహా మండలి అధ్యక్షులు శ్రీ దుష్మంత్ కుమార్, జెఈవో శ్రీ వీరబ్రహ్మం, చీఫ్ ఇంజనీర్ శ్రీ నాగేశ్వరరావు, డెప్యూటీ ఈవో శ్రీ గుణభూషణ్‌రెడ్డి, టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ప్రత్యేకాధికారి శ్రీ విజయసారధి, వైఖాన‌స ఆగ‌మ స‌ల‌హాదారు శ్రీ విష్ణుబ‌ట్టాచార్యులు, ఏఈవో శ్రీ దొరస్వామి నాయక్, సూపరింటెండెంట్ శ్రీ మల్లికార్జున, ఇత‌ర అధికారులు, అర్చ‌కులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.