KOIL ALWAR TIRUMANJANAM PERFORMED AT VENKATAPALEM SV TEMPLE _ వెంకటపాలెం శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
TIRUPATI, 08 JUNE 2022: The traditional temple cleaning ritual, Koil Alwar Tirumanjanam was performed in Sri Venkateswara temple at Venkatapalem on Wednesday.
This religious fete was observed between 2pm and 4pm.
In temple jargon, Koil means temple, Alwar means devotee and Tirumanjanam means cleaning with aromatic ingredients. So this unique fete involves cleansing of the temple by His devotee.
A mixture called ‘Parimalam’ is prepared out of vermilion, turmeric, sandal paste, Kichiligadda(a tuber) amd other aromatic ingredients.
This paste was applied to the sanctum sanctorum, roofs, walls, pillars etc. covering entire temple. This mixture also acts as a disinfectant.
Earlier, Punyahavachanam, Ratnadhivasam, Vimana Gopura Kalasa Sthapana, Ratnanyasam, Dhatunyasam, Vigraha Sthapana, Astabandhanam werw also observed between 8am and 11:30am.
In the evening Mahashanti Abhishekam, Pranayanam, Kumbharadhana, Sayanadhivasam, Sarva Devatarchana and Visesha Homams will be performed in the Yagashala.
JEO Sri Veerabrahmam, CVSO Sri Narasimha Kishore, DyEOs Sri Gunabhushan Reddy, Sri Govindarajan, All Projects Program Officer Sri Vijayasaradhi, one of the chief priests Sri Venugopala Deekshitulu, Agama Advisor Sri Vishnu Bhattacharyulu, VGO Sri Manohar, AEO Sri Dorasami Naik and others were present in Koil Alwar Tirumanjanam.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
వెంకటపాలెం శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
అమరావతి, 2022 జూన్ 08: గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెం గ్రామంలో టీటీడీ నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాల్లో భాగంగా బుధవారం మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 4 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు.
ఇందులో భాగంగా ఆలయాన్ని శుద్ధి చేసి, పసుపు, కుంకుమ, చందనం, సీకాయ, నామం, కర్పూరం, కిచిలిగడ్డ, కస్తూరి పసుపు, పచ్చాకు తదితరాలతో తయారుచేసిన సుగంధ మిశ్రమాన్ని గర్భాలయ గోడలకు ప్రోక్షణ చేశారు.
అంతకుముందు ఉదయం 8 నుండి 11.30 గంటల వరకు పుణ్యాహవచనం, రత్నాధివాసం, విమాన గోపుర కలశ స్థాపన, రత్నన్యాసం, ధాతు న్యాసం, విగ్రహ స్థాపన, అష్టబంధనం, యాగశాల వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు మహాశాంతి అభిషేకం, రాత్రి 8.30 నుండి 11 గంటల వరకు అగ్ని ప్రణయనం, కుంభారాధన, శయనాధివాసం, హౌత్రం, సర్వదేవతార్చన, విశేష హోమాలు, యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమాల్లో జెఈవో శ్రీ వీరబ్రహ్మం,సివి ఎస్వో శ్రీ నరసింహ కిషోర్, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, డెప్యూటీ ఈవోలు శ్రీ గుణభూషణ్‌రెడ్డి, శ్రీ విజయసారధి,శ్రీ గోవింద రాజన్ , శ్రీవారి ఆలయ ఆలయ ప్రధాన అర్చకులలో ఒకరైన శ్రీ వేణుగోపాల దీక్షితులు, వైఖానస ఆగమ సలహాదారు శ్రీ విష్ణుబట్టాచార్యులు, విజివో శ్రీ మనోహర్, ఏఈవో శ్రీ దొరస్వామి నాయక్, ఇతర అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.