KOIL ALWAR TIRUMANJANAM PERFORMED _ శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Tirumala, 31 Dec. 19: Ahead of Vaikunta Ekadasi, the traditional cleansing ritual of Koil Alwar Thirumanjanam was performed on Tuesday morning at Srivari temple.

Participating in the holy ritual along with Additional EO Sri AV Dharma Reddy,  the TTD Executive Officer Sri Anil Kumar Singhal said the cleansing fete will be conducted in Srivari temple four times a year that is during annual Brahmotsavams, Ugadi, Anivara Asthanam and Vaikunta Ekadasi. He said all arrangements are in place for Vaikuntha Ekadasi on January 6 and Dwadasi on January 7.

From the golden vimana of Ananda Nilayam to Bangaru Vakili all sub-temples, Prasada Potu, temple corridor, walls and ceilings besides puja utensils  were cleaned with Parimalam, he said.

Sheds in mada streets for Vaikunta Ekadasi queues

The EO said as in last year German were prepared for devotees waiting in the galleries of four mada streets where Anna Prasadam and drinking water will be served on besides toilets and bathrooms are also set up.

He appealed to the devotees to be patient and cooperate with temple staff and beget blessings and Vaikuntha Dwara darshan on January 6 and 7.

Chief Priest of the temple Sri Venugopal Dikshitulu, DyEO Sri Harindranath,VSO Sri Manohar, Peishkar Sri Lokanatham and others participated.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI  

శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

డిసెంబ‌రు 31,  తిరుమల 2019: తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ అర్చకులు, అధికారులు, సిబ్బంది ఆలయ శుద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌ మీడియాతో మాట్లాడుతూ జ‌న‌వ‌రి 6వ తేదీన వైకుంఠ ఏకాదశి, 7న ద్వాదశి పర్వదినాలు జ‌రుగ‌నున్నాయ‌ని తెలిపారు. బ్రహ్మోత్సవాలు, ఉగాది, ఆణివార ఆస్థానం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఆలయంలోని ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ప్రసాదాల పోటు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పుతోపాటు పూజాసామగ్రిని శుద్ధి చేసినట్టు తెలిపారు.

వైకుంఠ ఏకాద‌శికి మాడ వీధుల్లో షెడ్లు

వైకుంఠ ఏకాద‌శికి విచ్చేసే భ‌క్తులు చ‌లికి ఇబ్బందులు ప‌డ‌కుండా గ‌తేడాది త‌ర‌హాలోనే నారాయ‌ణ‌గిరి ఉద్యాన‌వ‌నాల‌తోపాటు మాడ వీధుల్లో షెడ్లు ఏర్పాటు చేశామ‌ని ఈవో తెలిపారు. భ‌క్తుల‌కు అన్న‌ప్ర‌సాదాలు, తాగునీరు అందించేందుకు ఏర్పాట్లు చేప‌ట్టామ‌ని, షెడ్ల‌కు అనుబంధంగా మ‌రుగుదొడ్లు ఏర్పాటుచేశామ‌ని వెల్ల‌డించారు. భ‌క్తులు టిటిడి అధికారుల‌కు స‌హ‌క‌రించి జ‌న‌వ‌రి 6, 7వ తేదీల్లో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం చేసుకోవాల‌ని ఈ సంద‌ర్భంగా ఈవో కోరారు.

కాగా, ఆలయంలో ఉదయం 6 నుండి ఉదయం 11 గంటల వరకు శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి వేశారు. శుద్ధి పూర్తి అయిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆ తరువాత భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, ఆల‌య ప్ర‌ధానార్చ‌కుల్లో ఒక‌రైన శ్రీ వేణుగోపాల దీక్షితులు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్‌, విఎస్వో శ్రీ మ‌నోహ‌ర్‌, పేష్కార్ శ్రీ లోక‌నాథం ఇతర అధికారులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.