KONETIRAYA SHINES ON SWARNA RATHA _ స్వర్ణరథంపై ఊరేగిన కోనేటిరాయుడు

Tirumala,15 April 2022: As part of the annual Vasantothsavam festivities, Sri Malayappa Swami accompanied with His two Consorts took a celestial ride on Swarna ratham and blessed devotees all along four Mada streets encircling Tirupati temple on Friday morning.

 

Tirumala reverberated with Govinda namams as thousands of Srivari devotees dragged the Swarna Ratham ahead of arriving at Vasantha Mandapam for Snapana Tirumanjanam.

 

Later in the afternoon devotees were enthralled as an imposing Snapana Tirumanjanam fete was performed.

 

Tirumala pontiffs Sri Sri Sri Pedda Jeeyarswami and Sri Sri Sri Chinna Jeeyarswami, State minister Sri Venugopala Krishna, TTD Chairman Sri YV Subba Reddy, TTD EO Dr KS Jawahar Reddy, Additional EO Sri AV Dharma Reddy, DyEO Sri Ramesh Babu, VGO Sri Bali Reddy and others were present.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI 

స్వర్ణరథంపై ఊరేగిన కోనేటిరాయుడు

తిరుమల, 2022 ఏప్రిల్ 15: తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల్లో భాగంగా రెండవరోజైన శుక్ర‌వారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా తిరుమాడ వీధులలో స్వర్ణరథంపై ఊరేగుతూ భక్తులను అనుహించారు.

ఇందులో భాగంగా ఉదయం 8 నుండి 9 గంటల నడుమ అత్యంత వైభవంగా సాగిన స్వర్ణరథోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొని గోవిందనామాలు జపిస్తూ రథాన్ని లాగారు. అనంతరం స్వామివారు వసంతోత్సవ మండపానికి వేంచేపుచేశారు. అక్కడ అర్చకులు వసంతోత్సవ అభిషేకాదులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా మధ్యాహ్నం స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, రాష్ట్ర మంత్రివ‌ర్యులు శ్రీ వేణుగోపాల‌కృష్ణ‌, టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ ర‌మేష్‌బాబు, విజివో శ్రీ బాలిరెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.