KOPPERA HUNDI DONATED _ శ్రీవారికి కొప్పెర హుండీ విరాళం
Tirumala, 20 July 2021: Devotees from Kopperavandlapalli near Tirupati belonging to Koppera caste have donated Hundial made of copper to Srivari temple on Tuesday.
Sri Koppera Sai Suresh and Sri Koppera Kumar who handed over the hundis to Peishkar of Srivari temple Sri Srihari said that their family has been presenting such hundis to Tirumala temple for the last 200 years.
The hundis were made of copper weighed 60 kgs and costing around ₹1.50 lakh.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
శ్రీవారికి కొప్పెర హుండీ విరాళం
తిరుమల, 20 జులై 2021: తిరుమల శ్రీవారికి మంగళవారం కొప్పెర హుండీ విరాళంగా అందింది. తిరుపతి సమీపంలోని కొప్పెరవాండ్లపల్లెకు చెందిన శ్రీ కొప్పెర సాయిసురేష్, శ్రీ కొప్పెర కుమార్ ఈ మేరకు హుండీని ఆలయంలో పేష్కార్ శ్రీ శ్రీహరికి అందించారు.
రాగి, ఇత్తడితో కలిపి తయారుచేసిన ఈ హుండీ బరువు 60 కిలోలు ఉంటుందని, దీని విలువ రూ.1.50 లక్షలని దాతలు తెలిపారు. తాము 200 ఏళ్లుగా వంశపారంపర్యంగా స్వామివారికి కొప్పెర హుండీలు సమర్పిస్తున్నామని దాతలు వెల్లడించారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.