KRISHNA-ANDAL TAKES FLOAT RIDE _ తెప్పపై ఆండాళ్‌ సమేత శ్రీకృష్ణస్వామివారి విహారం

Tirupati, 23 Feb. 21: On the third day of ongoing Teppotsavam of Lord Sri Govindaraja Swamy, in the guise of Sri Krishna Swamy, Lord took a celestial ride on the finely decked float along with Sri Andal Goda Devi on Tuesday evening.

The deities blessed the devotees between 6:30pm and 8pm on the float.

Spl. Gr. DyEO Sri Rajendrudu and others were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

తెప్పపై ఆండాళ్‌ సమేత శ్రీకృష్ణస్వామివారి విహారం

తిరుపతి, 2021 ఫిబ్రవరి 23: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాల్లో భాగంగా నాలుగోరోజు మంగ‌ళ‌‌వారం సాయంత్రం ఆండాళ్‌ సమేత శ్రీకృష్ణస్వామివారు తెప్పలపై విహరించి భక్తులకు అభయమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

ఇందులో భాగంగా ఉదయం 10 నుండి 11 గంటల వరకు ఆండాళ్‌ సమేత శ్రీకృష్ణస్వామివారి ఉత్స‌వ‌ర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనంలతో అభిషేకం చేశారు.

అనంతరం సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.00 గంటల వరకు ఆండాళ్‌ సమేత శ్రీకృష్ణస్వామివారు తెప్పపై విహరించి భక్తులకు కనువిందు చేశారు. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు.

కాగా బుధ‌వారం నుండి శుక్ర‌వారం వరకు శ్రీ గోవిందరాజస్వామివారు శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో కలిసి తెప్పపై ఏడు చుట్లు చుట్టి భక్తులకు కనువిందు చేస్తారు.

ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, హరికథ, సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రుడు, ఏఈవో శ్రీ ర‌వికుమార్‌రెడ్డి, సూపరింటెండెంట్లు శ్రీ వెంక‌టాద్రి, ‌‌శ్రీ రాజ్‌కుమార్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ కామ‌రాజు, శ్రీ మునీంద్ర‌బాబు ఇతర అధికారులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.