KRISHNA SWAMY RIDES ON 2ND DAY FLOAT FESTIVAL _ తెప్పపై రుక్మిణీకృష్ణుల అభయం
Tirumala, 25 Mar. 21: On the 2nd day of the ongoing annual float festival of Srivari temple, the utsava idols of Sri Rukmini sameta Sri Krishna swamy varu took the majestic float ride on Swami Pushkarini in total adherence to COVID-19 guidelines.
The float festival was a cynosure to the eyes of devotees as the utsava idols after procession boarded the float and went three rounds. The Veda Gosha by pundits, Mangala vadyam and sankeertans by the artists of the Annamacharya project enthralled the devotees.
Tirumala pontiff Sri Sri Sri Pedda Jeeyarswamy, TTD EO Dr KS Jawahar Reddy, Additional EO Sri AV Dharma Reddy, TTD board member Sri DP Anant, CE Sri Ramesh Reddy, Srivari temple DyEO Sri Harindranath were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
తెప్పపై రుక్మిణీకృష్ణుల అభయం
తిరుమల, 2021 మార్చి 25: తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల్లో రెండో రోజు గురువారం రాత్రి రుక్మిణీకృష్ణులు భక్తులకు అభయమిచ్చారు. కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ పుష్కరిణిలో తెప్పోత్సవాలు నిర్వహించారు.
ముందుగా సాయంత్రం 6 గంటలకు రుక్మిణీకృష్ణుల ఉత్సవమూర్తుల ఊరేగింపు మొదలైంది. ఆలయ నాలుగు మాడ వీధుల గుండా పుష్కరిణి వద్దకు చేరుకుంది. రెండో రోజు స్వామి, అమ్మవారు మూడు చుట్లు తిరిగి భక్తులను అనుగ్రహించారు. మంగళవాయిద్యం, వేదపండితుల వేదఘోష, అన్నమాచార్య ప్రాజెక్టు సంకీర్తనల మధ్య తెప్పోత్సవం కనువిందుగా జరిగింది.
ఈ కార్యక్రమంలో టిటిడి ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి, అదనపు ఈవో శ్రీ ఏ.వి.ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు శ్రీ డిపి.అనంత, శ్రీ సి.ప్రసాద్, సిఇ శ్రీ రమేష్‌రెడ్డి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.