KRT BTU OFF TO A CEREMONIOUS _ ధ్వజారోహణంతో వైభవంగా శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాలు ప్రారంభం

TIRUPATI, 30 MARCH 2022: The annual brahmotsavam in Sri Kodanda Rama Swamy temple at Tirupati commenced on a grand religious note on Wednesday.

After the thiruveedhi utsavam in the morning, the dhwaja patam with the image of Sri Garudalwar was hoisted on the temple pillar amidst the chanting of Vedic hymns in the auspicious Vrishabha Lagnam between 9:15am and 9:45am. Later Asthanam and Snapana Tirumanjanam to Ustava Murthies followed.

HH Sri Pedda Jeeyar and Sri Chinna Jeeyar Swamiji’s of Tirumala, Spl. Gr. DyEO Smt Parvati, AEO Sri Durgaraju, Agama Advisor Dr Vedantam Vishnu Bhattacharyulu, temple archaka Sri Nanda Kumar, and others were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ధ్వజారోహణంతో వైభవంగా శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాలు ప్రారంభం

తిరుపతి, 2022 మార్చి 30: తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో బుధవారం ఉదయం ధ్వజారోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.

కంకణబట్టార్ శ్రీ ఆనందకుమార దీక్షితులు ఆధ్వ‌ర్యంలో ఉదయం 9.15 నుండి 9.45 గంటల మధ్య వృష‌భ‌లగ్నంలో ధ్వజారోహణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో గరుత్మంతుని చిత్రంతో కూడిన ధ్వజపటానికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, భక్తుల గోవిందనామస్మరణ, రామనామ జపముల మధ్య ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపైకి అధిష్టింపచేశారు. సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడంతోపాటు సమాజశ్రేయస్సుకు, వంశాభివృద్ధికి ధ్వజారోహణం దోహదపడుతుందని అర్చకులు తెలిపారు.

అంతకుముందు ఉదయం 7.30 నుండి 9 గంటల వరకు శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామివారు, ధ్వజపటము, చక్రతాళ్వారులకు తిరువీధి ఉత్సవం నిర్వహించారు. అనంత‌రం ఉదయం 9.45 నుండి 10 గంటల వరకు ఆస్థానం నిర్వహించారు.

అనంతరం ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారి ఉత్సవర్లకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంల‌తో అభిషేకం చేశారు.

కాగా, రాత్రి 8 నుండి 10 గంట‌ల వ‌ర‌కు పెద్దశేష వాహన సేవ జ‌రుగ‌నుంది.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయ‌ర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్‌స్వామి, ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి పార్వతి, ఆగ‌మ స‌ల‌హాదారు శ్రీ విష్ణుభ‌ట్ట‌చార్యులు, ఏఈవో శ్రీ దుర్గరాజు, సూపరింటెండెంట్‌ శ్రీ రమేష్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ మునిరత్నం‌, శ్రీ జయకుమార్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.