KRT KALYANAM HELD _ నేత్ర‌ప‌ర్వంగా శ్రీ సీతారాముల కల్యాణం

TIRUPATI, 18 APRIL 2024: On the evening of Thursday, the celestial wedding ceremony of Sri Sita Rama Kalyanam was held with utmost religious fervour in Sri Kodanda Rama Swamy Temple in Tirupati.

The utsava deities of Sri Sita Rama along with Lakshmana Swamy were seated on a special platform decked in full splendour.

Later amidst chanting of Vedic hymns, the temple priests performed the divine marriage of Sri Sita Devi and Sri Rama while the devotees were seen immersed in devotional waves.

Temple DyEO Smt Nagaratna, Superintendent Sri Soma Sekhar and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

నేత్ర‌ప‌ర్వంగా శ్రీ సీతారాముల కల్యాణం

తిరుపతి, 2024 ఏప్రిల్ 18: తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీ‌ సీతారాముల కల్యాణం నేత్ర‌ప‌ర్వంగా జరిగింది.

ముందుగా అర్చకులు పుణ్యాహవచనం, సద్యో అంకురార్పణ, రక్షాబంధనం, విశేషారాధన చేశారు. ఆ తరువాత రక్షాబంధన, అగ్నిప్రతిష్ఠ, మధుపర్కం, కన్యాదానం, మహాసంకల్పం, స్వామి, అమ్మవారికి ప్రవరలు, మాంగళ్యపూజ చేపట్టారు. అనంతరం మాంగళ్యధారణ, ఉక్తహోమాలు, పూర్ణాహుతి, నివేదన, అక్షతారోహణం, ముత్యాల త‌లంబ్రాల స‌మ‌ర్ప‌ణ‌, విశేష నివేద‌న‌, మాల‌మార్పిడి, అక్ష‌తారోహ‌ణ‌, హార‌తి, చ‌తుర్వేద పారాయ‌ణం, య‌జ‌మానికి వేద ఆశీర్వాదం, హారతి ఇచ్చారు. కల్యాణం అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లను ఆలయ ప్రాంగ‌ణంలో ఊరేగింపు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఏఈవో శ్రీ పార్థసారథి, సూపరింటెండెంట్‌ శ్రీ సోమశేఖర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.