KUPCHANDRA PETA UTSAVAM HELD _ ఘనంగా శ్రీ కోదండరామస్వామివారి పేట ఉత్సవం

Tirupati, 10 Feb. 20: As per the tradition, Kupchandra Peta Utsavam was held under the aegis of Sri Kodandarama Swamy temple on Monday.

The utsava idols of Sri Kodandaramaswami along with Sita Devi and Lakshmana Swamy were taken on a grand procession to Kupuchandrapeta, which is located about 8 km from Tirupati.

Snapana Thirumanjanam and unjal seva to utsava idols were performed at the village and later in the evening and later the deities returned to the temple.

Sri Sri Sri Pedda Jeeyar Swamy, Sri Sri Sri Chinna Jeeyar, DyEO Smt Shanti, AEO Sri Durga Raju, Superintendent Sri Ramesh and large number of devotees participated.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI  

 

ఘనంగా శ్రీ కోదండరామస్వామివారి పేట ఉత్సవం

తిరుపతి, 2020, ఫిబ్రవరి 10: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి పేట ఉత్సవం సోమ‌వారం ఘనంగా జరిగింది. మాఘపౌర్ణమి సందర్భంగా శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామివారి ఉత్సవమూర్తులను కూపుచంద్రపేట గ్రామానికి ఊరేగింపుగా తీసుకెళ్లడం ఆనవాయితీ.

ఉదయం 6.00 గంటలకు ఆలయం నుండి స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులు ఊరేగింపు బయల్దేరింది. ఉదయం 9.30 గంటలకు తిరుపతికి 8 కిలోమీటర్ల దూరంలో గల కూపుచంద్రపేటకు చేరుకుంది. అక్కడ ఉదయం 10.00 నుండి 11.30 గంటల వరకు స్నపనతిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనంలతో స్వామి, అమ్మవారి ఉత్సవర్లకు అభిషేకం చేశారు.  

అనంతరం సాయంత్రం 4.00 నుంచి 5.00 గంటల వరకు ఊంజల్‌సేవ చేపడతారు. సాయంత్రం 5.30 గంటలకు అక్కడి నుండి బయల్దేరి రాత్రి 9.00 గంటలకు తిరిగి ఆలయానికి చేరుకుంటారు.

ప్రతి సంవత్సరం మాఘమాసం పౌర్ణమి సందర్భంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఉదయం, సాయంత్రం జరిగిన స్వామివారి ఊరేగింపులో టిటిడి హిందూధర్మ ప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో భజనలు, కోలాటాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్‌ స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమ‌తి శాంతి, ఏఈవో శ్రీ దుర్గ‌రాజు, సూపరింటెండెంట్‌  శ్రీ ర‌మేష్‌, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.