LADDUS SET FOR SITA RAMA KALYANAM _ ఒంటిమిట్ట శ్రీ‌సీతా రాముల‌ కల్యాణానికి తిరుమ‌ల ల‌డ్డూ సిద్ధం

TIRUMALA, 19 APRIL 2024: The most sought-after Tirumala Srivari Laddu Prasadams gets ready for the celestial Sri Sita Rama Kalyanam.

The packing of mini(25gm) laddus were carried out in Srivari Seva Sadan 1 in Tirumala with the help of Srivari Seva Volunteers.

1.20laddus Laddus were packed in 60 thousands zip lock packets with two laddus in each pack by nearly 250 women and men volunteers under the supervision of Deputy EO General Sri Siva Prasad and AEO Potu Sri Srinivasulu on Friday.

These laddus will be offered as prasadam to the devotees who participate in the state festival of the divine wedding ceremony, Sri Sita Rama Kalyanam that takes place between 6:30pm and 8:30pm as part of the ongoing Sri Rama Navami Brahmotsavam at Vontimitta in Kadapa district on April 22.

Srivari Seva staff and others were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఒంటిమిట్ట శ్రీ‌సీతా రాముల‌ కల్యాణానికి తిరుమ‌ల ల‌డ్డూ సిద్ధం

తిరుమ‌ల‌, 2024 ఏప్రిల్ 19: ఒంటిమిట్ట శ్రీ సీతా రాముల‌ కల్యాణానికి విచ్చేసే భ‌క్తుల‌కు అందించేందుకు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు సిద్ధమయ్యాయి. తిరుమలలోని శ్రీవారి సేవా సదన్ – 1లో శ్రీవారి సేవ‌కుల‌ సహకారంతో మినీ (25 గ్రాముల) లడ్డూల ప్యాకింగ్‌ను శుక్ర‌వారం నిర్వహించారు.

డెప్యూటీ ఈవో (జనరల్‌) శ్రీ శివప్రసాద్‌, పోటు ఏఈవో శ్రీనివాసులు ఆధ్వర్యంలో దాదాపు 250 మంది మహిళా, పురుష శ్రీ‌వారి సేవ‌కులు 1.20 ల‌క్ష‌ల లడ్డూలను 60 వేల జిప్‌లాక్‌ ప్యాకెట్లలో ఒక్కో ప్యాక్‌లో రెండు లడ్డూలు ఉంచారు.

కడపజిల్లా ఒంటిమిట్టలో జరుగుతున్న శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 22వ తేదీ సాయంత్రం 6:30 నుంచి 8:30 గంటల మధ్య అత్యంత వైభ‌వంగా జరిగే రాష్ట్ర పండుగ శ్రీ సీతా రాముల‌ కల్యాణంలో పాల్గొనే భక్తులకు ఈ లడ్డూలను ప్రసాదంగా అందజేయనున్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో శ్రీవారి సేవా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.