LAKSHA KUMKUMARCHANA FOR BLISSFUL MARITAL LIFE AND LONGEVITY OF SPOUSE LIFE_ శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మూెత్సవాల ప్రత్యేకవ్యాసం -2 అంకురార్పణ వైశిష్ట్యం

Tiruchanur, 12 Nov,2017: The auspicious ritual of ‘Laksha Kumkumarchana’ will be observed with religious fervour on November 14 in the famous shrine of Goddess Sri Padamvathi Devi temple at Tiruchanur.

AS A PRELUDE TO ANNUAL FETE

The event, which is considered auspicious will be performed between 8am and 12 noon, amidst the renditions of sacred chants and mellifluous hymns with the processional deity of goddess Padmavati seated on a finely decked ‘Asan’ in ‘Mukha Mandapam’ situated opposite to Sri Krishna Swamy temple within the main temple premises. This ritual is considered as a prelude to Brahmotsavams appeasing Goddess for the successful conduct of mega event.

TTD INTRODUCED ELEVEN YEARS AGO

Laksha Kumkumarchana was introduced by TTD about eleven years ago. The priests recites ‘Lakshmi Astottaram’ and ‘Lakshmi Sahasranamam’ with devotional fervour and performs Archana’ with vermilion invoking multiple names of the goddess.

SMOOTH CONDUCT OF ANNUAL BRAHMOTSAVAMS

By propitiating the deity with this unique ritual, priests hope for a smooth and successful conduct of the future events. According to the Hindu Sanatana Dharma, ‘Kumkum’ or vermilion is considered sacred, especially for married women, as it is applied by them over the forehead (near parting of the hair) seeking the longevity of their husbands. It is also considered as the symbolic representation of Goddess Shakti, who is also revered as Goddess Lakshmi, Goddess Saraswathi and Goddess Parvathi.

The grihastas who are willing to take part in this ritual have to pay Rs.1,116 per ticket on which two persons will be allowed.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మూెత్సవాల ప్రత్యేకవ్యాసం -2

అంకురార్పణ వైశిష్ట్యం

నవంబరు 12, తిరుపతి, 2017: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ కార్తీక బ్రహ్మూెత్సవాలు నవంబరు 15 రెంయి 23వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఇందుకోసం నవంబరు 14వ తేదీ మంగళవారం సాయంత్రం 6.30 నుంచి 8.30 గంటల వరకు ఘనంగా అంకురార్పణ జరుగనుంది. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం లక్షకుంకుమార్చన వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఘట్టాల విశేషాలను తెలుసుకుందాం.

అంకురార్పణ ఘట్టంలో ముందుగా భగవంతుని అనుజ్ఞ తీసుకుని షోడషోపచారాలు సమర్పిస్తారు. సమస్తమైన విఘ్నాలు తొలగేందుకు విష్వక్సేనారాధన నిర్వహిస్తారు. ఆ తరువాత స్థల శుద్ధి, ద్రవ్యశుద్ధి, శరీర శుద్ధి, ఆత్మశుద్ధి కోసం పుణ్యహవచనం చేపడతారు. పుణ్యమైన మంత్రాలను పఠించి కలశంలోని నీటిని శుద్ధి చేయడాన్ని పుణ్యహవచనం అంటారు. సభాపూజలో భాగంగా భగవంతునికి సాష్టాంగ ప్రమాణం సమర్పించి అనుజ్ఞ తీసుకుంటారు. యాగశాలలో ఎవరెవరు ఎలాంటి విధులు నిర్వహించాలనే విషయాన్ని రుత్విక్‌వరణంలో వివరిస్తారు.

అంకురార్పణ కార్యక్రమంలో ప్రధాన ఘట్టం మ త్సంగ్రహణం. అమ్మవారి ఆలయం వద్దగల శుక్రవారపు తోటలో ఈశాన్య దిశలో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ముందుగా శ్రీభూవరాహస్వామివారిని ప్రార్థించి, గాయత్రి అనుష్టానం, భూసూక్తం పారాయణం చేస్తారు. ధూపదీప నైవేద్యం సమర్పించి మాషాచోప(మినుముల అన్నం) బలిహరణ చేస్తారు. ఆ ప్రాంతాన్ని గోమూత్రం, గోమేయంతో శుద్ధి చేసి భూమాతను ఆవాహన చేసి వస్త్రసమర్పణగావిస్తారు. భూమాత ఉధ్వాసన అనంతరం పుట్టమన్ను తీసుకుని ఆలయానికి వేంచేపు చేస్తారు. యాగశాలలో వాస్తుదోష నివారణ కోసం హవనం నిర్వహిస్తారు. ఆ తరువాత పాలికల్లో మట్టిని, నవధాన్యాలను ఉంచి పసుపునీళ్లు చల్లి బీజవాపనం చేస్తారు. అనంతరం నివేదన, బలిహరణ, నీరాజనం, మంత్రపుష్పం, తీర్థప్రసాద గోష్టి నిర్వహిస్తారు.

అఖండ దీపారాధన :

యాగశాలలో అంకురార్పణ సందర్భంగా అఖండదీపారాధన చేస్తారు. బ్రహ్మూెత్సవాలు జరిగే తొమ్మిది రోజులు ఈ దీపం వెలుగుతూనే ఉంటుంది. అనంతరం ఈ దీపాన్ని గర్భాలయంలో గల దీపంలో ఐక్యం చేస్తారు.

అంకురార్పణ ఘట్టానికి వైఖానసం, పాంచరాత్ర ఆగమాల్లో విశేష ప్రాధాన్యం ఉందని, ఇవి భగవంతునికి రెండు కళ్లు లాంటివని పండితులు చెబుతున్నారు. వైఖానసంలో మంత్రభాగాన్ని ప్రధానంగా తీసుకుని విష్ణువును అర్చిస్తారు. పాంచరాత్రంలో మంత్రం, తంత్రం, క్రియ, ముద్రలు ప్రధానంగా ఉంటాయి.

లక్ష కుంకుమార్చన :

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మంగళవారం ఉదయం 8 నుంచి 12 గంటల వరకు లక్ష కుంకుమార్చన సేవ జరుగనుంది. దాదాపు 10 సంవత్సరాల క్రితం లక్ష కుంకుమార్చన సేవను ప్రవేశపెట్టారు. ఇందులో అమ్మవారి సహస్రనామాన్ని 10 సార్లు 20 మంది అర్చకస్వాములతో ప్రార్థన చేస్తారు. అమ్మవారు మంచి శక్తితో ఉండి పది రోజుల పాటు బ్రహ్మూెత్సవాల్లో భక్తులందరికీ పరిపూర్ణమైన క పాకటాక్షాలు అందించాలని కోరుతారు. లక్ష కుంకుమార్చనలో పాల్గొనే భక్తులకు శక్తి, ముక్తి, భక్తి కలుగుతుందని అర్చకులు తెలిపారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.