LAKSHA KUMKUMARCHANA PERFORMED IN SRI KT_ శ్రీ కపిలేశ్వరాలయంలో ఘనంగా లక్ష కుంకుమార్చన

Tirupati, 7 September 2018: Laksha Kumkumarchana was performed in Sri Kapileswara Swamy temple to Kamakshi Devi on Friday.

As this happens to be the last Friday in sravana month, this celestial ritual is performed.

Temple DyEO Sri Subrahmanyam and others were also present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ కపిలేశ్వరాలయంలో ఘనంగా లక్ష కుంకుమార్చన

సెప్టెంబరు 07, తిరుపతి 2018: టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శుక్రవారం శ్రీ కామాక్షి అమ్మవారికి ఘనంగా లక్ష కుంకుమార్చన నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని గాజులతో ప్రత్యేకంగా అలంకరించారు.

ఉదయం 8.30 నుండి 11.30 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు లక్ష కుంకుమార్చన చేపట్టారు. ఈ సందర్భంగా లక్ష సార్లు కుంకుమతో అమ్మవారికి అర్చన చేశారు. ఆ తరువాత శ్రీ కపిలేశ్వరస్వామివారు, శ్రీ కామాక్షి అమ్మవారు పురవీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానికాలయాల డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్‌ శ్రీ రాజ్‌కుమార్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ నారాయణ ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.