DEVOUT TAKES PART IN LAKSHA KUMKUMARCHANA VIRTUALLY _ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యంలో ఘ‌నంగా ఆన్‌లైన్‌ ల‌క్షకుంకుమార్చ‌న‌

Tiruchanoor, 10 Nov. 20: As the annual karthika brahmotsvams are set to be performed in Ekantam at Tiruchanoor temple from November 11 to 19, Laksha Kumkumarchana has been performed in the temple on Tuesday.

A total of 603 devotees took part in this ritual via virtual platform. The Grihastha devotees who took part in this fete will beget one blouse piece, uttariyam, vermilion, turmeric sachets, two holy threads, sugar candy packet and sacred rice Akshata through the postal department as ‘Prasadam’. 

The utsava murty of Goddess Sri Padmavathi seated in Sri Krishna Mukha Mandapam and Laksha kumkumarchana has been performed chanting the divine namas of Goddess by archakas from 8am till 12noon.

According to the acharya purushas, this fete is usually observed to appease Mother Goddess to bless and carry forward the annual mega fete in a smooth manner.

TTD EO Dr KS Jawahar Reddy, JEO Sri P Basanth Kumar, DyEO Smt Jhansi Rani and others also participated.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యంలో ఘ‌నంగా ఆన్‌లైన్‌ ల‌క్షకుంకుమార్చ‌న‌

తిరుపతి, 2020 నవంబరు 10: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యంలో న‌వంబ‌రు 11 నుండి 19వ తేదీ వరకు ఏకాంతంగా జ‌రుగ‌నున్న వార్షిక కార్తీక బ్ర‌హ్మోత్స‌వాలను పుర‌స్క‌రించుకుని ఉద‌యం 8 నుండి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు ఆన్‌లైన్ ల‌క్ష‌కుంకుమార్చ‌న సేవ‌ ఘ‌నంగా జ‌రిగింది. శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేసిన ఈ సేవ‌లో ఆన్‌లైన్ విధానం ద్వారా 603 మంది గృహ‌స్తులు త‌మ ఇళ్ల నుండే పాల్గొన్నారు. వీరికి ఉత్త‌రీయం, ర‌విక‌, కుంకుమ‌, అక్షింతలు, రెండు ప‌సుపుదారాలు, క‌ల‌కండ ప్ర‌సాదాన్ని త‌పాలా శాఖ‌ ద్వారా గృహ‌స్తుల చిరునామాకు పంప‌డం జ‌రిగింది.

ఆలయంలోని శ్రీకృష్ణ ముఖ మండపంలో శ్రీ పద్మావతి అమ్మవారిని ఆశీనులను చేసి ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అర్చకులు శాస్త్రోక్తంగా లక్షకుంకుమార్చన సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు లక్ష్మీ అష్టోత్తరం, లక్ష్మీ సహస్రనామాలను వళ్లిస్తూ అమ్మవారిని కుంకుమతో అర్చన చేశారు.

 ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ బ్ర‌హ్మోత్స‌వాల ముందురోజు ల‌క్షకుంకుమార్చ‌న సేవ నిర్వ‌హించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంద‌న్నారు. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల కోవిడ్‌-19 మార్గ‌ద‌ర్శ‌కాల మేరకు ఈ సారి బ్ర‌హ్మోత్స‌వాలను ఏకాంతంగా నిర్వ‌హిస్తామ‌ని చెప్పారు. ఈ ఉత్స‌వాలు దిగ్విజ‌యంగా జ‌ర‌గాల‌ని ఈ సంద‌ర్భంగా అమ్మ‌వారిని ప్రార్థించిన‌ట్టు తెలిపారు.

కాగా, హిందూ సనాతన ధర్మంలో కుంకుమకు విశేష‌ ప్రాధాన్యం ఉంది. వివాహితురాలైన మహిళ నుదుట కుంకుమ ధరించడం వల్ల భర్త దీర్ఘాయుష్షు పొందుతాడని హిందూ ధర్మం చెబుతోంది. ల‌క్ష్మీ, సరస్వతి, పార్వతి అమ్మవార్ల పేర్లతో పిలుస్తున్న శక్తి అమ్మవారికి ప్రతిరూపంగా సింధూరం లేదా కుంకుమకు ప్రాశస్త్యం ఉంది. అమ్మవారి ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు లాంటి భారీ ఉత్సవాలను నిర్వహించే ముందు అర్చకులు లక్షకుంకుమార్చన నిర్వహించడం సంప్రదాయం. ఈ విశిష్టమైన సేవ ద్వారా అమ్మవారు ప్రసన్నమై ఉత్సవాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా జరిగేలా ఆశీర్వదిస్తారని అర్చకులు తెలిపారు.

అంకురార్ప‌ణ :

మంగ‌ళ‌వారం సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంట‌ల న‌డుమ పుణ్యా‌హ‌వ‌చ‌నం, ర‌క్షాబంధ‌నం, సేనాధిప‌తి ఉత్స‌వం, యాగ‌శాల‌లో అంకురార్ప‌ణ కార్య‌క్ర‌మాలు చేప‌డ‌తారు.

న‌వంబ‌రు 11న ధ్వ‌జారోహ‌ణం :

ఆలయంలో న‌వంబ‌రు 11న బుధ‌వారం ఉదయం 8 నుంచి 9 గంటల వరకు ధ్వజస్థంభ తిరుమంజనం, అలంకారం, ఉదయం 9.30 నుండి 9.47 గంటల నడుమ ధ‌నుర్ల‌గ్నంలో ధ్వజారోహణంతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు చిన్నశేష వాహనంపై అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు.

ఈ కార్యక్రమంలో జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణి, ఏఈవో శ్రీ సుబమ్రణ్యం, అర్చకులు, ఇతర అధికారులు  పాల్గొన్నారు.

వాహనసేవల వివరాలు :

తేదీ                                     ఉదయం                                       రాత్రి

11-11-2020(బుధ‌వారం)      ధ్వజారోహణం – చిన్నశేషవాహనం

12-11-2020(గురువారం)     పెద్దశేషవాహనం – హంసవాహనం

13-11-2020(శుక్ర‌వారం)   ముత్యపుపందిరి వాహనం –  సింహవాహనం

14-11-2020(శ‌నివారం)        కల్పవృక్ష వాహనం – హనుమంతవాహనం

15-11-2020(ఆదివారం)          పల్లకీ ఉత్సవం – వ‌సంతోత్స‌వం, గజవాహనం

16-11-2020(సోమ‌వారం)     సర్వభూపాలవాహనం – స్వర్ణరథం(స‌ర్వ‌భూపాల వాహ‌నం), గరుడవాహనం

17-11-2020(మంగ‌ళ‌వారం)     సూర్యప్రభ వాహనం  – చంద్రప్రభ వాహనం

18-11-2020(బుధ‌వారం)        రథోత్సవం(స‌ర్వ‌భూపాల వాహ‌నం) – అశ్వ వాహనం

19-11-2020(గురువారం)      పంచమితీర్థం(వాహ‌న‌మండ‌పంలో)  – ధ్వజావరోహణం.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.