LAKSHMANA PRANA PRADATA ANJANEYA: SRI SRI ABHOBILA RAMANUJA JEEYAR SWAMIJI _ లక్ష్మణ ప్రాణ ప్రదాత ఆంజనేయుడు: శ్రీశ్రీశ్రీ అహోబిల రామానుజ జీయర్ స్వామీజీ

Tirumala, 05 June 2024: HH Sri Sri Sri Ahobila Ramanuja Jeeyar Swamy of Telangana State, Shamshabad emphasized that Sri Anjaneya was Prana Pradata – the life giver for Lakshmana.

The Hanuman Jayanti celebrations concluded on Wednesday in Tirumala. 

The spiritual and devotional music programs performed at Nada Neerajanam, Akashaganga and Japali Theertham have impressed the devotees to a great extent.

On Nadanirajanam on stage…

On this occasion, Swamiji gave Anugraha Bhashanam and said that Hanuman used to carefully observe every work and perform it righteously.  It is said that it was Hanuman who made Sugriva to have an alliance with Rama.  Swamiji explained that Hanuman proved that the strength of mannerisms is much greater than the strength of the body and mind.

Later, Dr. Vibhishana Sharma, Special Officer of SV Institute of Higher Vedic Studies, honoured Swamiji with a shawl and Srivari Prasadam.

Akasaganga, Japali also witnessed incredible performances of devotional Music, Dance, Harikatha by students and artists of various projects of TTD.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

లక్ష్మణ ప్రాణ ప్రదాత ఆంజనేయుడు: శ్రీశ్రీశ్రీ అహోబిల రామానుజ జీయర్ స్వామీజీ

– భక్తి భావాన్ని పంచిన ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు

తిరుమ‌ల‌, 2024 జూన్ 05: రామ రావణ యుద్ధంలో లక్ష్మణ ప్రాణ ప్రదాత హనుమంతుడని తెలంగాణ రాష్ట్రం శంషాబాద్ కు చెందిన శ్రీశ్రీశ్రీ అహోబిల రామానుజ జీయర్ స్వామి ఉద్ఘాటించారు.

హనుమత్‌ జయంతి ఉత్సవాలు బుధవారం తిరుమ‌ల‌లో ఘనంగా ముగిశాయి.

నాదనీరాజనం, ఆకాశ‌గంగ‌, జ‌పాలి తీర్థంలో నిర్వ‌హించిన ఆధ్యాత్మిక, భ‌క్తి సంగీత కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆక‌ట్టుకున్నాయి.

నాదనీరాజనం వేదికపై….

ఈ సందర్భంగా స్వామీజీ అనుగ్రహ భాషణం చేస్తూ హనుమంతుడు ప్రతి కార్యాన్ని సున్నితంగా గమనించి ధర్మబద్ధంగా నిర్వహించేవాడని తెలిపారు. సుగ్రీవుడికి రాముడికి మైత్రి కల్పించింది హనుమంతుడని చెప్పారు. హనుమంతుడు దేహ బలం, బుద్ధి బలం కంటే సంస్కార బలం చాలా గొప్పదని నిరూపించాడని స్వామీజీ వివరించారు.

అనంతరం ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రత్యేక అధికారి డాక్టర్ విభీషణ శర్మ స్వామీజీని శాలువ, శ్రీవారి ప్రసాదాలతో సత్కరించారు.

ఆకాశగంగలో…..

ఆకాశ‌గంగలోని శ్రీ బాలాంజ‌నేయ‌స్వామివారి ఆల‌యం వ‌ద్ద శ‌నివారం ఉదయం 10 నుండి 10.30 గంటల వ‌ర‌కు జాతీయ సంస్కృత విశ్వ విద్యాల‌యం అధ్యాప‌కులు ఆచార్య రాఘ‌వాచార్యులు హ‌నుమంతుని జ‌న్మ విశేషాలు తెలిపారు.

జాపాలి క్షేత్రంలో….

జాపాలి క్షేత్రంలో ఉద‌యం 8 నుంచి 10 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీమతి భార్గవి బృందం హనుమాన్ చాలీసా ప‌ఠించారు. ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీ హరినాధ బృందం నృత్య కార్యక్రమం నిర్వహించారు

అనంతరం మధ్యాహ్నం 2 నుండి 3 గంటల వరకు తిరుప‌తికి చెందిన శ్రీ ప్ర‌స‌న్న ల‌క్ష్మీ బృందం హనుమాన్ చాలీసా ప‌ఠించారు. సాయంత్రం 4 నుండి 5 గంట‌ల వ‌ర‌కు అన్నమాచార్య ప్రాజెక్ట్‌ కళాకారులు శ్రీమతి మంజుల బృందం హరికథ గానం చేశారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.