LAKSHMI KASULA HARAM PROCESSION HELD _ తిరుమలలో శ్రీవారి లక్ష్మీహారం ఊరేగింపు
Tirumala, 15 Nov. 20: The traditional Pournami Garuda Seva Lakshmi Kasula Haram procession held at Tirumala on Sunday morning.
Considered as one of the precious jewels being decked to Lord Malayappa during every pournami Garuda Seva at Tirumala, the ornament is usually sent to Tiruchanoor to be decorated to Goddess Sri Padmavathi Devi during Gaja Vahana Seva of Tiruchanoor Brahmotsavams every year as a practice.
As part of it, the jewel was paraded from temple to vaibhotsavam mandapam on Sunday at Tirumala and later taken to Tiruchanoor.
TTD EO Dr KS Jawahar Reddy, Temple Peishkar Sri Jagan Mohanacharyulu, AVSO Sri Gangaraju, temple inspector Sri Verma were also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
తిరుమలలో శ్రీవారి లక్ష్మీహారం ఊరేగింపు
తిరుమల, 2020 నవంబరు 15: తిరుమలలో ఆదివారం ఉదయం శ్రీవారి లక్ష్మీహారాన్ని ఆలయం నుండి వైభవోత్సవమండపం వరకు ఊరేగించారు. అంతకుముందు శ్రీవారి పాదాల చెంత లక్ష్మీహారాన్ని ఉంచి ప్రత్యేక పూజలు చేశారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా గజవాహనం రోజున శ్రీవారి ఆభరణాల ఖజానా నుంచి అత్యంత ప్రధానమైన లక్ష్మీకాసుల హారాన్ని అమ్మవారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా ఆదివారం తిరుమల నుంచి అత్యంత భద్రత నడుమ వాహనంలో శ్రీవారి లక్ష్మీహారాన్ని తిరుచానూరుకు తరలించారు. సాయంత్రం గజవాహన సేవలో శ్రీవారి లక్ష్మీహారాన్ని అమ్మవారికి అలంకరిస్తారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి, ఓఎస్డీ శ్రీ పాల శేషాద్రి, పేష్కార్ శ్రీ జగన్మోహనాచార్యులు, ఏవిఎస్వో శ్రీ గంగరాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.